AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని తెలుసా? ప్రపంచంలోనే వింతైన ఆలయం ఎక్కడ ఉంది

ప్రస్తుత కాలుష్యం, ఉరుకుల పరుగుల జీవనశైలిలో అందరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య 'జుట్టు రాలడం'. కురులు తెల్లబడినా, పలచబడినా ఆందోళన చెందని వారు ఉండరు. విభిన్న రకాల షాంపూలు, నూనెలు వాడి విసిగిపోయారా? అయితే మీకోసం ఒక వింతైన పరిష్కారం ఉంది.

ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని తెలుసా? ప్రపంచంలోనే వింతైన ఆలయం ఎక్కడ ఉంది
Japan
Nikhil
|

Updated on: Jan 08, 2026 | 11:08 PM

Share

జుట్టు రాలకుండా ఉండాలన్నా, ఒత్తుగా పెరగాలన్నా ఏకంగా ఒక దేవుడిని ప్రార్థించి, మీ జుట్టులో కొంత భాగాన్ని కానుకగా ఇస్తే చాలట! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది అక్షరాలా నిజం. జపాన్ లోని ఒక ప్రత్యేక ప్రాంతంలో కేవలం కురుల ఆరోగ్యం కోసం అంకితం చేయబడిన ఒక అద్భుతమైన ఆలయం ఉంది. ఏటా వేలాది మంది పర్యాటకులు తమ జుట్టు బాగుండాలని కోరుకుంటూ ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. ఆ ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ అనుసరించే విచిత్రమైన ఆచారాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

జుట్టు కోసమే పుణ్యక్షేత్రం..

జపాన్‌లోని క్యోటో నగరంలో ‘మికామి’ అనే పుణ్యక్షేత్రం ఉంది. ఇది ప్రపంచంలోనే జుట్టు కోసం అంకితం చేయబడిన ఏకైక ఆలయంగా గుర్తింపు పొందింది. జుట్టు పెరుగుదల, ఆరోగ్యం, బట్టతల సమస్యల నుండి విముక్తి పొందాలని ఆశించే వారు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం సాధారణ ప్రజలే కాదు, బ్యూటీషియన్లు, హెయిర్ స్టైలిస్టులుగా కెరీర్ ప్రారంభించే విద్యార్థులు కూడా తమ వృత్తిలో రాణించాలని ఈ దేవుడిని దర్శించుకుంటారు.

వింతైన ప్రార్థన..

ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడి పేరు మసాయుకి ఫుజివారా. ఇక్కడ ప్రార్థన చేసే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేక ప్రార్థన కవర్‌ను కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఆలయ పూజారులు భక్తుల జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి ఆ కవర్‌లో వేస్తారు. ఆ కవర్‌ను మసాయుకి ఫుజివారా దేవుడి పాదాల వద్ద ఉంచి ప్రార్థించిన తర్వాత తిరిగి పూజారికి అప్పగించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో జుట్టు సంబంధిత సమస్యలు దరిచేరవని, ఉన్న జుట్టు దృఢంగా మారుతుందని ఇక్కడి ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు.

Hair God

Hair God

ఆలయం వెనుక ఆసక్తికర కథ

మికామి మందిరానికి జపాన్‌లోని మొట్టమొదటి క్షౌరశాలగా కూడా పేరుంది. దీని వెనుక ఒక గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తి కథ దాగి ఉంది. ఫుజివారా ఉనెమెనోసుకే మసాయుకి అనే క్షరకుడు తన వృత్తిని దైవంగా భావించేవాడట. తన నైపుణ్యంతో జుట్టు కత్తిరించడం, స్టైలింగ్ చేయడంలో అద్భుతమైన పునాది వేశాడు. ఆ వృత్తికి ఆయన అందించిన గౌరవానికి గుర్తుగా, ప్రజలు ఆయనను దైవంగా భావించి ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఆయన చనిపోయిన 17వ తేదీన ప్రతి నెలా జపాన్ అంతటా సెలూన్ల నిర్వాహకులు దుకాణాలు మూసివేసి ఆయనకు నివాళులర్పిస్తారు. నమ్మకమే మనకు బలాన్ని ఇస్తుంది. మికామి ఆలయానికి వచ్చిన భక్తులకు తమ జుట్టు సమస్యలు తగ్గడం వల్ల ఈ క్షేత్రానికి మరింత ఆదరణ పెరిగింది. సైన్స్ పరంగా జుట్టు ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటూనే, ఇలాంటి పురాతన విశ్వాసాలను గౌరవించే వారి సంఖ్య నేటికీ తగ్గలేదు.