AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేయసితో లవ్‌ మ్యారేజ్‌కి ఖతర్నాక్ స్కెచ్‌.. కట్‌చేస్తే జైల్లో ప్రియుడు! అసలు ముచ్చట ఇదీ..

సినీ ఫక్కీలో ప్రియురాలిని ఇంప్రెస్‌ చేసి లవ్‌ మ్యారేజ్‌ చేసుకోవాలని కలలు గన్న ఓ తుంటరి ప్రేమికుడు.. సినీ ఫక్కీలో జైల్లో ఊచలు లెక్కెట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు. ప్రియురాలితోపాటు ఆమె కుటుంబం మొత్తాన్ని బుట్టలో వేసుకుంటే.. ఎంచక్కా పిల్లనిచ్చి పెళ్లి చేస్తారని కలలు కన్నాడు. కట్ చేస్తే.. సీన్ రివర్స్!

ప్రేయసితో లవ్‌ మ్యారేజ్‌కి ఖతర్నాక్ స్కెచ్‌.. కట్‌చేస్తే జైల్లో ప్రియుడు! అసలు ముచ్చట ఇదీ..
Boy Friend Staging Accident To Gain Girlfriend's Family's Trust
Srilakshmi C
|

Updated on: Jan 08, 2026 | 6:11 PM

Share

ప్రియురాలిని ఇంప్రెస్‌ చేసి లవ్‌ మ్యారేజ్‌ చేసుకోవాలని కలలు గన్న ఓ తుంటరి ప్రేమికుడు.. సినీ ఫక్కీలో యాక్సిడెంట్‌ నాటకం ఆడాడు. ప్రియురాలితోపాటు ఆమె కుటుంబం మొత్తాన్ని బుట్టలో వేసుకోవచ్చని క్రేజీ స్టంట్‌ ప్లాన్‌ చేస్తే అదికాస్తా.. బెడిసికొట్టింది. ఆనక అసలు సంగతి బయట పడటంతో కటకటాల పాలయ్యాడు. ఈ విచిత్ర ఘటన కేరళలోని పథనంథిట్టలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

కేరళలోని పతనంతిట్టకు చెందిన రంజిత్‌ రాజన్‌ అనే యువకుడు ఓ యువతిని దూరం నుంచి తెగ ప్రేమించేశాడు. అయితే ఆమె కుటుంబానికి తనపై మంచి అభిప్రాయం ఏర్పడితే.. వాళ్లే దగ్గరుంచి తమకు వివాహం చేస్తారని భావించాడు. అంతే లవర్‌ ఫ్యామిలీని ఎలా ఇంప్రెస్‌ చేద్దామా..! అని ఫ్రెండ్స్‌తో కలిసి సిట్టింగ్‌ వేశాడు. ప్రేయసి తల్లిదండ్రుల కళ్లకు తానొక వీరుడిలా కనిపించాలని ఓ యాక్సిడెంట్‌ ప్లాన్‌ చేశాడు. ప్లాన్‌ ప్రకారం తన స్నేహితుడు అజేష్‌తో కోచింగ్‌ సెంటర్‌ నుంచి స్కూటీపై వస్తున్న ప్రియురాలిని కారుతో ఢీకొట్టించాడు. అటుగా వెళ్తున్నట్లు మరో కారులో వచ్చిన రంజిత్‌ ఆమెను స్వయంగా తానే కాపాడినట్లుగా సీన్‌ క్రియేట్ చేసి ఆస్పత్రికి చేర్చాడు.

అయితే ఈ ప్రమాదంలో ప్రేయసికి మోచేయి, వేలు విరిగాయి. ఈ ఘటన గతేడాది డిసెంబరు 23న జరిగింది. రంజిత్‌ ప్రియురాలు కోచింగ్‌ సెంటర్‌ నుంచి స్కూటీపై వెళ్తుండగా అతడి స్నేహితుడు కారుతో ఢీకొట్టి వెళ్లిపోయాడు. ప్రమాదంలో తమ కుమార్తెను కాపాడిన రంజిత్‌ను ఆమె తల్లిదండ్రులు మెచ్చుకొని పెళ్లి చేస్తారని రంజిత్‌ భావించాడు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ప్లాన్‌ గురించి తెలియని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. పోలీసుల దర్యాప్తులో అజేష్ అనే వ్యక్తిని హిట్ అండ్ రన్‌లో ఉన్న డ్రైవర్‌గా గుర్తించారు. విచారణలో వీరి పథకం బయటపడింది. ఇంకేముందీ.. రంజిత్, అజేష్ ఇద్దరిపైనా పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.