AP Telangana Water Dispute: రాయలసీమ లిఫ్ట్.. ఆగిందా, ఆపారా..!
'కృష్ణా నదికి వచ్చే నీళ్లు తక్కువ, అవసరాలు ఎక్కువ'.. ఇదే కదా తెలుగు రాష్ట్రాలు చెబుతున్నది. ఆ నీళ్ల వాటా 'మావంటే మావి' అని తగువులాడుకుంటున్నాయి రాష్ట్రాలు. ఈ ఇద్దరి కొట్లాటల మధ్య ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయో తెలుసా? అటుఇటుగా 650 టీఎంసీలు. ఒక్కోసారి వెయ్యి టీఎంసీల వరకు ఎవరికీ కాకుండా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. అసలు.. కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిన వాటానే 811 టీఎంసీలు. తాత్కాలికంగా తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చినా.. వాడుకుంటున్నది మాత్రం 116, 117 టీఎంసీలే. ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులున్నాయ్. గట్టిగా వాడినా 100 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతోంది ఏపీ. పరిస్థితి ఇలా ఉంటే.. కృష్ణా నీటిని సమర్ధవంతంగా వాడుకునే పరిస్థితే లేదంటే.. ఆ ప్రాజెక్ట్‌ను ఆపండి, ఈ ప్రాజెక్టును నిలిపివేయండని అగ్గి రాజేసుకుంటున్నాయి. లేటెస్ట్‌గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై జరుగుతున్న రచ్చనే చూద్దాం. నేనే ఆపించానని సీఎం రేవంత్ అంటారు. మీరు ఆపింది కాదు.. తమ పోరాట ఫలితమే అంటోంది బీఆర్ఎస్. NGT ఆపమంది కాబట్టే ఆగిపోయింది అని చంద్రబాబు.. లేదూ సీఎం రేవంత్ అడగ్గానే చంద్రబాబు ఆపేశారని వైఎస్ జగన్. వీళ్లెవరూ కాదు.. ఆపిన ఘనత బీజేపీదేనంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇంతకీ.. ఈ ప్రాజెక్ట్ ఆగిందా, ఆపారా, ఆపించారా? దీని చుట్టూ జరుగుతున్న రాజకీయాలేంటి?

ఇప్పటి వరకు అందరూ మాట్లాడారు. ఎవరి స్టేట్‌మెంట్ వాళ్లిచ్చారు. ఎవరెన్ని చెప్పినా.. ఏదో మిస్ అవుతున్నట్టుంది కదా..! సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పే దాకా రాయలసీమ ప్రాజెక్ట్ ఊసే వినిపించలేదు. తాను మొదలుపెట్టిన ప్రాజెక్ట్‌ను ఎందుకు పూర్తిచేయట్లేదని ఈ 19 నెలల్లో వైఎస్ జగన్ ఒక్కసారి కూడా స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. ఇక్కడో డౌట్ ఏంటంటే.. ‘తానే ఆపించాను’ అనేంత వరకు ఆ ఎత్తిపోతల పనులు జరుగుతున్నట్టేగా లెక్క. జరగని పనులను చూపించి ఆపించాను అనాల్సిన అవసరం లేదు కదా. మరి.. 2020లోనే పనులు ఆగిపోయాయ్ అని ఏపీ ప్రభుత్వం ఎందుకంది? దాదాపు ఐదేళ్ల క్రితమే ప్రాజెక్ట్ ఆగింది నిజమైతే.. సీఎం రేవంత్ నుంచి ఆ స్టేట్‌మెంట్ ఎందుకొచ్చింది? బీఆర్ఎస్ కూడా తాము ఉన్నప్పుడే ప్రాజెక్టును ఆపించామని చెప్పింది. అసలైన విషయం ఇంకోటుంది. తీర్పును ఉల్లంఘించినందుకు 2 కోట్ల 65 లక్షల రూపాయల జరిమానా విధించింది NGT. ఎప్పుడొచ్చిందా నోటీస్? 2024లో. ఏంటి దానర్ధం? అప్పటిదాకా పనులు జరుగుతున్నట్టే అనుకోవాలా? ఎవరి వర్షన్ వాళ్లదే. మరొక్కసారి మొదటి నుంచీ వద్దాం. క్రెడిట్ తాను తీసుకోకూడదని చెప్పి ఇన్నాళ్లూ ఈ విషయం దాచి పెట్టా.. ఇక చెప్పక తప్పని పరిస్థితి వచ్చిందని బ్లాస్టింగ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపేందుకు ఒక అడుగు ముందుకేసి తానే సీఎం చంద్రబాబుతో మాట్లాడానన్నారు. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు...
