Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Smartphones: లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్‌.. హై ఎండ్‌ ఫీచర్లతో టాప్‌ క్లాస్‌ స్మార్ట్‌ ఫోన్లు వచ్చేస్తున్నాయ్‌..

ఇదే క్రమంలో సెప్టెంబర్‌లో యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. ఇప్పుడు అక్టోబర్‌లో టాప్‌ బ్రాండ్లు అయిన శామ్సంగ్‌, గూగుల్‌, వివో, వన్‌ ప్లస్‌ వంటి కంపెనీలకు చెందిన కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అక్టోబర్‌ మాసంలో మార్కెట్లోకి రానున్న టాప్‌ స్మార్ట ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Upcoming Smartphones: లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్‌.. హై ఎండ్‌ ఫీచర్లతో టాప్‌ క్లాస్‌ స్మార్ట్‌ ఫోన్లు వచ్చేస్తున్నాయ్‌..
Google Pixel 8 Series
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 04, 2023 | 9:15 AM

మన దేశంలో పండుగల సీజన్‌ ప్రారంభమైంది. వినాయకచవితి ముగిసింది. ఇక దసరా, దీపావళి రానున్నాయి. ఈ కాలంలో మార్కెట్‌ కు జోష్‌ వస్తుంది. కొనుగోళ్లు భారీగా ఉంటాయి. ప్రజలు కొత్త వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతారు. దీనిని అందిపుచ్చుకునేందుకు ప్రధాన టెక్‌ కంపెనీలు ఉత్సాహం చూపుతుంటాయి. కొత్త ఉత్పత్తులు లాంచ్‌ చేయడానికి ప్రణాళికచేస్తుంటాయి. ఇదే క్రమంలో సెప్టెంబర్‌లో యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. ఇప్పుడు అక్టోబర్‌లో టాప్‌ బ్రాండ్లు అయిన శామ్సంగ్‌, గూగుల్‌, వివో, వన్‌ ప్లస్‌ వంటి కంపెనీలకు చెందిన కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అక్టోబర్‌ మాసంలో మార్కెట్లోకి రానున్న టాప్‌ బ్రాండ్లకు చెందిన కొత్త స్మార్ట ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌ పిక్సల్‌ 8 సిరీస్‌.. గూగుల్‌ పిక్సల్‌ 8, పిక్సల్‌ 8 ప్రో ఫోన్లు 2023 అక్టోబర్‌ 4న మన దేశంలో లాంచ్‌ కానున్నాయి. టెన్సర్ జీ3 చిప్‌సెట్, కొత్త టైటాన్ సెక్యూరిటీ ఎం2 చిప్‌తో వస్తున్నాయి. ఇవి మెరుగైన కెమెరాలను కలిగి ఉంటాయి. పిక్సెల్ 8 ఫోన్లో 50ఎంపీ+12ఎంపీ సెటప్‌తో వస్తుంది. పిక్సెల్‌ 8 ప్రో మోడల్ 50ఎంపీ+48ఎంపీ+48ఎంపీ కెమెరా సెటప్‌తో వస్తుంది.రెండు మోడళ్లలో 10.5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంటుంది. 120హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. 6.2, 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీప్లస్‌ ఓఎల్‌ఈడీ ప్యానల్స్‌ కలిగి ఉంటాయి. 1 టీబీ వరకూ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి.

శామ్సంగ్‌ గెలాక్సీ ఎ23 ఎఫ్‌ఈ.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ అమోల్డ్‌ FHD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 50MP ప్రైమరీ సెన్సార్‌ ఉంటుంది. ఇదిక ఊడా అక్టోబర్ 4నే మన దేశ మార్కెట్లోకి రానుంది.12జీబీ ర్యామ్‌, 256స్టోరేజ్‌తో వస్తుంది.

ఇవి కూడా చదవండి

వివో వీ29 సిరీస్.. ఈ సిరీస్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. వివో వీ29, వివో వీ29 ప్రో. ఇవి కూడా అక్టోబర్‌ నాలుగునే మార్కెట్లోకి రాన్నుఆయి. 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌766 సెన్సార్‌తో వస్తుంది. 6.78 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ కర్వ్‌డ్‌ అమోల్డ్‌ డిస్‌ ప్లే ఉంటుంది.

వన్‌ ప్లస్‌ ఓపెన్.. ఇది అక్టోబర్‌ 19న మన దేశ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ ఎల్‌టీపీఓ సాంకేతికతతో వస్తుంది. 2కే రిజల్యూషన్‌తో 7.8 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లే ఉంటుంది. మడతపెట్టిన తర్వాత 6.3 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ ప్లే కనిపిస్తుంది. రెండు డిస్‌ ప్లేలు 120హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటాయి. 48ఎంపీ ప్రైమరీ, 64ఎంపీ టెలిఫొటో లెన్స్‌తో వస్తుంది.

రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్.. అక్టోబర్‌ చివరి నాటికి ఈ సిరీస్‌ ఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్‌13, రెడ్‌మీ నోట్‌13 ప్రో ఫోన్లు ఉనఆనయి. రెండూ కూడా 120హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. 108ఎంపీ ‍ప్రైమరీ కెమెరాతో వస్తుంది. 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ ప్లే వస్తుంది. హై ఎండ్‌ స్పెసిఫికేషన్లను అందిస్తుంది.

ఒప్పో ఫైండ్‌ ఎన్‌3 ఫ్లిప్‌.. దీనిలో 6.80 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ అమోల్డ్‌ డిస్‌ ప్లే 120హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. వెనుకవైపు 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 890 ప్రైమరీ సెన్సార్‌ ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..