Eye Protection Tips: ఫోన్ బారి నుంచి మీ కళ్లను కాపాడండి.. ఈ టిప్స్‌తో మీ నేత్రాలు భద్రం.. పాటించండి..
సహజంగా కంప్యూటర్లపై ఎక్కువ సేపు పనిచేసే వారు ఐ స్ట్రెయిన్ తో బాధపడుతుంటారు. ఇదే మాదిరిగా స్మార్ట్ ఫోన్ అధికంగా వినియోగించే వారు స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ కు గురవుతున్నారు. ఇది కొన్ని అసాధారణ పరిస్థితుల్లో తప్ప శాశ్వత అంధత్వాన్ని కలుగజేయదు. కానీ కంటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. కంటి చూపు దెబ్బతినేలా చేస్తుంది. అందుకే స్మార్ట్ వినియోగించే టప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మొబైల్ వాడకం ఎక్కువైంది. రోజులో అధిక సమయం ఫోన్ తోనే గడిపేవారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటున్నారు. దానికి తోడు కంప్యూటర్లపై గంటలు గంటలు పనిచేస్తుంటారు. ఫలితంగా వారి కళ్లు బాగా దెబ్బతింటున్నాయి. సహజంగా కంప్యూటర్లపై ఎక్కువ సేపు పనిచేసే వారు ఐ స్ట్రెయిన్ తో బాధపడుతుంటారు. ఇదే మాదిరిగా స్మార్ట్ ఫోన్ అధికంగా వినియోగించే వారు స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ కు గురవుతున్నారు. ఇది కొన్ని అసాధారణ పరిస్థితుల్లో తప్ప శాశ్వత అంధత్వాన్ని కలుగుజేయదు. కానీ కంటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. కంటి చూపు దెబ్బతినేలా చేస్తుంది. అందుకే స్మార్ట్ వినియోగించే టప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం కొన్ని టిప్స్ మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి..
టెక్ట్స్ సైజ్ పెంచండి.. స్మార్ట్ ఫోన్ అధికంగా వినియోగించే వారి కళ్లు అధిక ఒత్తిడికి గురవుతాయి. కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్, టెక్ట్స్ సైజ్ వంటివి దీనిని ప్రభావితం చేస్తాయి. స్మార్ట్ ఫోన్లలో ఈ సెట్టింగ్‌లను మార్చడానికి అవకాశం ఉంటుంది. చిన్న టెక్ట్స్ సైజ్ కంటిపై మరింత ఒత్తిడి పెంచుతుంది కాబట్టి వీలైనంత పెద్దగా ఫాంట్ సైజ్ ఉండేలా చూసుకోవాలి. ఇది కంటిపై ఒత్తిడిని కొంతమేర తగ్గిస్తుంది.
బ్రైట్ నెస్ తగ్గించండి.. రాత్రి సమయంలో ఫోన్ స్క్రీన్ డిస్ ప్లే బ్రైట్ నెస్ అధికంగా ఉంటే అది కంటికి ఇబ్బందిని కలుగజేస్తుంది. అందుకే మన ఉంటున్న బయట వాతావరణాన్ని బట్టి ఫోన్ బ్రైట్ నెస్ అడ్జస్ట్ అయ్యేలా ఆటోమేటిక్ సెట్టింగ్ ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. బయట ఎక్కువ వెలుతురు ఉంటే ఎక్కువ బ్రైట్ నెస్, చీకటి వేళ తక్కువ బ్రైట్ నెస్ ఉంటే కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.
దూరంగా ఉంచండి.. చాలా ఫోన్ ను చాలా దగ్గరకు ముఖంపైకి పెట్టుకొని వినియోగిస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు మీ ఫోన్ స్క్రీన్‌ను 16 నుంచి 18 అంగుళాల మధ్య ఎంత దూరంమైన స్పష్టంగానే కనిపిస్తుంది. కాబట్టి మరీ దగ్గరగా ఫోన్ ను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ దగ్గరగా చూడాల్సి వస్తే.. ఫోన్ దగ్గరకు జరిపే బదులు.. మీ స్క్రీన్‌పై జూమ్ ఆప్షన్ ను వినియోగించండి.
నైట్ మోడ్ వాడాలి.. రాత్రి వేళ లైట్లు ఆఫ్ చేశాక ఫోన్ అస్సలు వాడకూడదు. ఇది చాలా ప్రమాదకరం. వాస్తవానికి రాత్రి సమయంలో కూడా కళ్లపై ఫోన్ కాంతి అధిక ప్రభావం చూపుతుంది. అందుకే ఫోన్లోని నైట్ మోడ్ ను ఆన్ చేసుకోవాలి. ఇటీవల కాంలో అన్ని ఫోన్లలో ఈ నైట్ మోడ్ ఆప్షన్ వస్తోంది. మీ కళ్లను సంరక్షించుకోవడానికి ఇది సులభమైన మార్గం.
రెప్పవేయడం మర్చిపోవద్దు.. ఫోన్‌లో కంటెంట్‌ని చదువుతున్నప్పుడు మీరు క్రమం తప్పకుండా రెప్పవేయాలని గుర్తుంచుకోండి. చాలా సార్లు, మనకు కంటెంట్‌పై దృష్టి సారిస్తాం కానీ రెప్పవేయడం మర్చిపోతాం. ఇది కూడా చాలా ప్రమాదకరం. రెప్పపోయకపోతే కళ్లు త్వరగా అలసిపోతాయి. కళ్లు అప్పుడు రెప్ప వేస్తూ ఉంటే కళ్లకు విశ్రాంతి దొరకుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాక కళ్లు పొడిబారకుండా చేస్తుంది. కళ్లకు తేమనిస్తుంది.
చీకటిలో మీ ఫోన్ వద్దు.. చీకటి వేళ, రాత్రి పూట లైట్లు కూడా ఆఫ్ చేసిన తర్వాత, ఫోన్ చూడటానికి ప్రయత్నించకండి. ఒకవేళ చూసినా చదవడం, రాయడం అస్సలు చేయొద్దు. ఎందుకంటే రాత్రి వేళ బ్లూ లైట్ కంటి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. పైన చెప్పిన విధంగా నైట్ మోడ్ ఆన్ చేసుకోవడం, బ్లూలైట్ ఫిల్టర్లను వినియోగించడం చేస్తుండాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..