వివో వీ29: అక్టోబర్ 4వ తేదీన మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్ ఫోన్స్‌లో వీవో వీ29 ఒకటి. 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 40వేలలోపు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఈ ఫోన్ రానుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 4600 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.