- Telugu News Photo Gallery Technology photos Samsung launching new smartphone Samsung galaxy s23 fe features and price details
Samsung Galaxy S23 FE: సామ్‌సంగ్ నుంచి స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ అదుర్స్ అంతే..
ఓవైపు బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని సంస్థలు ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్నాయి. ఇక మరికొన్ని కంపెనీలు ప్రీమియం బడ్జెట్‌లోనే ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. అయితే సామ్‌సంగ్ మాత్రం అటు బడ్జెట్ మార్కెట్‌తో పాటు ఇటు ప్రీమియం మార్కెట్‌ను సైతం టార్గెట్ చేస్తూ ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 ఎఫ్‌ఈ పేరుతో మరో ప్రీమియం ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చే పనిలో పడింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Oct 02, 2023 | 5:14 PM

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 ఎఫ్‌ఈ స్మార్ట్ ఫోన్‌ను అక్టోబర్ 4వ తేదీన మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇదే సమయంలో గూగుల్ కంపెనీకి చెందిన గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8ప్రో వంటి ఫోన్‌లను కూడా మార్కెట్లోకి వస్తున్నాయి.

ఇక గ్యాలకసీ ఎస్23 ఎఫ్‌ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. 6. 4 ఇంచెస్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ను 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ వేరియంట్స్‌లో లాంచ్ చేయనున్నారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా రెయిర్ సెటప్‌ను అందించనున్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 12 ఎంపీ అల్ట్రావైడ్, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన టెలిఫొటో కెమెరాను ఇవ్వనున్నట్లు సమాచారం. 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.

ఇక ధర విషయానికొస్తే సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 ఎఫ్‌ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 60 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.





























