WhatsApp: ఇలా చేస్తే మీ వాట్సాప్ సేఫ్‌గా ఉంటుంది.. వివరాలివే..

 WhatsApp New Feature: ప్రముఖ ఇన్‌స్టాంగ్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వినియోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్‌కు విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఈ క్రేజ్‌నే సైబర్ కేటుగాళ్లు.. తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అమాయక ప్రజల జేబులను కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ వినియోగదారులకు హానీ కలిగించే స్కామ్‌లు,

WhatsApp: ఇలా చేస్తే మీ వాట్సాప్ సేఫ్‌గా ఉంటుంది.. వివరాలివే..
Whatsapp
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 04, 2023 | 5:08 AM

 WhatsApp New Feature: ప్రముఖ ఇన్‌స్టాంగ్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వినియోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్‌కు విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఈ క్రేజ్‌నే సైబర్ కేటుగాళ్లు.. తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అమాయక ప్రజల జేబులను కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ వినియోగదారులకు హానీ కలిగించే స్కామ్‌లు, హానీకరమైన ఎంటీటీల ఫ్రీక్వెన్సి భారీగా పెరిగింది. కీలమైన సమాచారం ఇతరులతో పంచుకోవడం, తెలియకుండానే కాల్ ఫార్వాడింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం. అటాకర్స్‌కు వాట్సాప్ ఖాతా యాక్సెస్ ఇవ్వడం వంటి వాటి కారణంగా ప్రజలు మోసపోతున్నారు. వాట్సాప్ హ్యాకింగ్ కోసం స్కామర్లు నిత్యం రకరకాల ఆయుధాలను యూజర్లపై వదులుతున్నారు.

ప్రజలను మోసగించడానికి సైబర్ నేరగాళ్లు చాలా వరకు ఆఫర్ల పేరుతో ఫేక్ లింక్స్ పంపిస్తున్నారు. వారిని నమ్మించడానికి స్కామర్లు కొన్ని డబ్బులు కూడా పంపిస్తుంటారు. అలా మెల్లమెల్లగా వినియోగదారులు స్కామర్లు తమ ఆధీనంలోకి తీసుకుని, అందినకాడికి దోచేసుకుంటారు. అందుకే వాట్సాప్‌లో వచ్చే గుర్తు తెలియని యాప్స్, లింక్స్, ఆఫర్లను అస్సలు క్లిక్ చేయకూడదు.

ఆకట్టుకునే ఆఫర్స్..

ఇవి కూడా చదవండి

మెయిల్ ఐడీతో పాటు.. ఐదుగురికి ఈ లింక్ షేర్ చేస్తే కొత్త iPhone 15 ఉచితంగా పొందుతారు అని వాట్సాప్‌లో ఫార్వడ్ మెసేజ్ మీకు అందిందా? అయితే, ఇది కచ్చితంగా స్కామర్ల పనే. వ్యక్తిగత డేటా అడిగితే.. ఈ లింక్‌లను ఎప్పుడూ ఓపెన్ చేయొద్దు. ఇలాంటి లింక్స్ షేర్ చేయొద్దని అవతలి వారికి కూడా తెలియజేయాలి.

అనుమానాస్పదన ఏపీకే లింక్.. 

స్కామర్లు ప్రజలను దోచుకోవడానికి నిత్యం రకరకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. బ్యాంక్ అప్లికేషన్ APKలను సవరించి, వారి హానికరమైన కోడ్‌తో వాటిని ఇన్‌ఫెక్ట్ చేసి, బాధితులకు యాప్‌లను పంపుతున్నారు. దాదాపు స్కామర్‌లు బ్యాంకింగ్ ఏజెంట్‌లుగా ప్రజలను మోసం చేస్తుంటారు. నకిలీ ఫిషింగ్ వెబ్‌సైట్‌ల ద్వారా ప్రజలను సంప్రదిస్తారు. హెల్ప్ లైన్ కోసం యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని నమ్మిస్తారు. అది నమ్మి జనాలు ఈ యాప్‌లను తమ మొబైల్స్‌లో ఇన్‌స్టాల్ చేస్తారు. తద్వారా కీలకమైన బ్యాంక్‌ వివరాలన్నీ ఎంటర్ చేస్తారు. అయితే, ఇలా ఎప్పుడూ చేయొద్దు. ఇది ఒక స్కామ్. ఇదే టెక్నిక్ ఇతర రకాల స్కామ్‌లలో కూడా అనేకసార్లు వెలుగుచూసింది.

ఇంటర్నేషనల్ నెంబర్స్‌ నుంచి కాల్స్..

ఇటీవల, ఓవర్సీస్ నుండి కాల్స్ కూడా వస్తున్నాయి. అలాంటి కాల్స్ మీకు వస్తే ఎప్పుడూ రిసీవ్ చేసుకోకండి. అలాంటి కాల్స్ వస్తే వెంటనే దానిని రిపోర్ట్ చేసి, బ్లాక్ చేయండి. వాట్సాప్ కూడా ఈ కాల్‌లను అరికట్టడానికి చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి కాల్స్ మీకు వస్తే మాత్రం తప్పకుండా రిజెక్ట్ చేయండి.

ఆ లింక్‌లపై క్లిక్ చేయొద్దు..

హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు పంపే గుర్తు తెలియని లింక్‌ను ఏమాత్రం క్లిక్ చేయొద్దు. వీటిపై క్లిక్ చేసిన తర్వాత.. అది ఫిషింగ్ వెబ్‌సైట్‌కి తీసుకెళుతుంది. లేదంటే నేరుగా వారు పంపిన మాల్‌వేర్, ఇతర హ్యాకింగ్ ఏజెంట్స్ మొబైల్‌, డివైజ్‌లోకి వచ్చేస్తాయి. అందుకు గుర్తు తెలియని నెంబర్, కంపెనీ నుంచి గానీ మెసేజ్ వస్తే ఏమాత్రం ఆలోచించకుండా డిలీట్ గానీ, బ్లాక్ గానీ చేసేయండి.

సేఫ్‌గా ఉండండి..

వాట్సాప్ స్కామ్ బారిన పడకుండా ఉండేందుకు వాట్సాప్ కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్‌ని ఆన్ చేసుకోవాలి. తెలియని లింక్స్‌పై క్లిక్ చేయకుండా ఉండాలి. మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..