Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best smartphones: ఈ రెండు ఫోన్లలో ఒకటి ఎంచుకోవడం కష్టమే..అసలు తేడాలు తెలిస్తే షాక్

దేశంలోని స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో వివిధ బ్రాండ్ల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఒకదాన్ని మించి మరొకటి అనేక ఫీచర్లు, ప్రత్యేకతతో ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం మిడ్ రేంజ్ ధరలో ఉండే ఫోన్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో వాటిని డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. మిడ్ రేంజ్ అంటే సుమారు రూ.35 వేల లోపు ధరలో లభించే ఫోన్లు అని చెప్పవచ్చు. వీటిలో పోకో ఎఫ్ 7, ఐక్యూ నియో 10 ఫోన్ల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో వాటి ధర, బ్యాటరీ, ప్రాసెసర్, పనితీరు, కెెమెరా తదితర విషయాలను తెలుసుకుందాం.

Best smartphones: ఈ రెండు ఫోన్లలో ఒకటి ఎంచుకోవడం కష్టమే..అసలు తేడాలు తెలిస్తే షాక్
Poco F7 And Iqoo Neo 10
Srinu
|

Updated on: Jul 03, 2025 | 3:45 PM

Share

పోకో ఎఫ్ 7 స్మార్ట్ ఫోన్ లో 6.83 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. ఇది 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, 2560 హెచ్ జెడ్ ఇన్ స్టంట్ టచ్ శాంప్లింగ్ రేటు కలిగి ఉంది. 3200 నిట్ ల గరిష్ట బ్రైట్ నెస్ దీని ప్రత్యేకత. డిస్ ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా 7ఐ వేశారు. ఐపీ68, ఐపీ69 రేటింగ్ అసిస్టెంట్స్ తో ఫోన్ 1.5 మీటర్ల లోతులో సుమారు 30 నిమిషాలు మునిగిపోయి ఉన్నా ఇబ్బంది ఉండదు. ఐక్యూ నియో 10 ఫోన్ లో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే అమర్చారు. ఇది 144 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, 5500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంది. నీరు, దుమ్ము నిరోధకత కోసం ఐపీ 65 రేటింగ్ తో తీసుకువచ్చారు. అంటే పూర్తిస్థాయిలో నీటిని ఆపలేదు. కేవలం తేలిక పాటి వర్షాన్ని మాత్రమే తట్టుకోగలదు. ప్రాసెసర్ విషయంలో పోకో ఎఫ్ 7, ఐక్యూ నియో 10.. రెండు ఫోన్లు ఒకే విధంగా ఉన్నాయి. అండ్రానో 825 జీపీయూతో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎస్ జెన్ 4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతాయి. ఎల్ పీడీడీాఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజీ ఎంపికలో అందుబాటులో ఉన్నాయి. అయితే పోకో ఎఫ్ 7 (12 జీబీ)తో పోల్చితే ఐక్యూ బేస్ వేరియంట్ (8 జీబీ)లో తక్కువ ర్యామ్ ఆప్షన్ ఉంది. నియో 10 కూడా 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో యూఎఫ్ఎస్ 4.1కి మద్దతు ఇస్తుంది. పోకో ఎఫ్ 7లో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 880 ప్రైమరీ షూటర్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగల్ లెన్స్, ముందు భాగంలో 20 ఎంపీ సెల్పీ కెమెరా ఏర్పాటు చేశారు. ఐక్యూ నియో 10లో కూడా అదే సోనీ ప్రైమరీ షూటర్, 8 ఎంపీ అల్ల్రా వైడ్ యాంగిల్ లెన్స్, ముందు భాగంలో 32 ఎంపీ షూటర్ అమర్చారు.

పోకో ఎఫ్ 7 ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్ఓఎస్ 2.0పై నడుస్తుంది. దీనికి నాలుగేళ్ల ఓఎస్ అప్ డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ ల హామీ ఇచ్చారు. ఐక్యూ నియో 10 ఫోన్ ఫన్ టచ్ ఓఎస్ 15పై ఆధారపడి నడుస్తుంది. దీనికి మూడేళ్ల ఓఎస్ అప్ డేట్లు, నాలుగేళ్ల భద్రతా ప్యాచ్ ల హామీ ఉంది. పోకో ఎఫ్ 7లో 7,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీనికి 90 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతు ఉంటుంది. ఐక్యూ నియో 10లో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. దీనికి కూడా 90 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతు ఉంటుంది. పోకో ఎఫ్ 7 స్మార్ట్ ఫోన్ రెండు రకాల వేరియంట్లలో విడుదలైంది. 12 జీబీ+256 జీబీ మోడల్ రూ.31,999, అలాగే 12 జీబీ ర్యామ్ + 512 జీబీ మోడల్ రూ.33,999కు అందుబాటులో ఉన్నాయి. ఐక్యూ నియో 10 ఫోన్ కు సంబంధించి 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ రూ.31,999, అలాగే 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజీ మోడల్ రూ.40,999 పలుకుతోంది.