Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Phones: సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్ యూజర్లకు శుభవార్త.. ఇక ఫోన్ దొంగతనాలకు చెక్

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం అనేది పరిపాటిగా మారింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్లు ఎవరి ఆర్థిక స్థితికి తగినట్లుగా వారు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ కొంత మంది దొంగలు మనం ఏమరుపాటుగా ఉన్నప్పుడు ఈ ఫోన్లను దొంగలిస్తున్నారు. ఇలా ఫోన్లు దొంగతనానికి గురైనప్పుడు ఫోన్ పోవడంతో పాటు అందులో ఉండే మన విలువైన డేటా కోల్పోయే ప్రమాదం ఉంది.

Samsung Phones: సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్ యూజర్లకు శుభవార్త.. ఇక ఫోన్ దొంగతనాలకు చెక్
Samsung
Srinu
| Edited By: TV9 Telugu|

Updated on: Jul 03, 2025 | 4:30 PM

Share

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ దొంగతనాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సామ్‌సంగ్ గెలాక్సీ వంటి అధిక ధరతో ఉండే ఫోన్లు తస్కరణకు గురి కావడంతో యాంటీ థెఫ్ట్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాలని వినియోగదారులు కోరుతున్నారు. అందువల్ల యాంటీ థెఫ్ట్ ఫీచర్లతో గెలాక్సీ ఫోన్లు వన్ యూఐ 7 ఓఎస్ అప్‌డేట్‌తో విడుదల చేశారు. ఈ అదనపు భద్రతా లక్షణాలు వినియోగదారులు వారి డేటాతో వారి ఫోన్లను రక్షించుకోవడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అప్‌డేటెడ్ ఏఐ ఆధారిత థెఫ్ట్ డిటెక్షన్‌తో పాటు రిమోట్ లాకింగ్ సామర్థ్యాలు, బయోమెట్రిక్ రక్షణ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్‌ను పరిచయం చేస్తుంది. సామ్‌సంగ్ వన్ యూఐ 7 అప్‌డేట్‌తో అప్‌డేట్ చేసిన యాంటీ-థెఫ్ట్ ఫీచర్‌ల వల్ల యాంటీ-రాబరీ ఫీచర్‌లను పొందుతున్న ఫోన్ల జాబితాలో గెలాక్సీకు చోటు కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

యాంటీ థెఫ్ట్ ఫీచర్లను మొదట్లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్‌లకు విడుదల చేశారు. అలాగే తర్వాత గెలాక్సీ ఎస్-24, ఎస్-23, ఎస్-22 సిరీస్‌లకు యాంటీథెఫ్ట్ జోడించారు. అంతేకాకుండా కంపెనీకు సంబంధించిన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లైన గెలాక్సీ జెడ్ ఫోల్డ్-6, జెడ్ ఫ్లిప్-6, జెడ్ ఫోల్డ్-5, జెడ్ ఫ్లిప్-5 ఈ అప్‌డేట్‌ను అందిస్తున్నాయి. వన్ యూఐ-7లోని కొత్త థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్లలో థెఫ్ట్ డిటెక్షన్ లాక్, ఆఫ్‌లైన్ డివైస్ లాక్, రిమోట్ లాక్ ఉన్నాయి. ఇంకా కంపెనీ ఐడెంటిటీ చెక్, సెక్యూరిటీ డిలే వంటి కొత్త యాంటీ-రాబరీ ఫీచర్‌లను యాడ్ చేసింది.  అయితే గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సెట్టింగ్‌లకు వెళ్లి థెఫ్ట్ ప్రొటెక్షన్ టూల్‌ను యాక్సెస్ చేయాలని సూచిస్తున్నారు. 

ఈ ఫీచర్లన్నీ త్వరలో మరిన్ని గెలాక్సీ ఫోన్‌లకు అందుబాటులోకి వస్తాయని సామ్‌సంగ్ ధ్రువీకరించింది. ఈ ఫీచర్లు గూగుల్ నుంచి ప్రామాణిక ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఆధారంగా నిర్మించారు. కానీ మీ యాక్సెస్ ఆధారాలు లేదా ఆఫ్‌లైన్ భద్రతా లక్షణాలు రాజీపడే ప్రమాదం ఉన్నందున అధిక ప్రమాదకర పరిస్థితులకు అదనపు రక్షణను సామ్‌సంగ్ సెక్యూరిటీ అప్‌డేట్ ప్రవేశపెట్టిందని, భద్రతను ఒక అడుగు ముందుకు వేయాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి