Sundar Pichai: భారత్ డిజిటల్ వృద్ధికి కట్టుబడి ఉన్నాం.. త్వరలోనే పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ.. గూగుల్ సీఈఓ
Google for India 2023: భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాలను విస్తరించడంపై గూగుల్ ఇప్పటికే ప్రత్యేక దృష్టిసారించింది. ఈ ప్రణాళికలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పలుమార్లు సమావేశమయ్యారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను విస్తరించడంలో పాలుపంచుకునే Google ప్రణాళిక..

Google for India 2023: భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాలను విస్తరించడంపై గూగుల్ ఇప్పటికే ప్రత్యేక దృష్టిసారించింది. ఈ ప్రణాళికలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పలుమార్లు సమావేశమయ్యారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను విస్తరించడంలో పాలుపంచుకునే Google ప్రణాళిక, తదితర అంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి మోదీ, సుందర్ పిచాయ్ ఇటీవల (అక్టోబర్ 16) వర్చువల్ గా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే భారతదేశంలో Chromebook తయారీకి సంబంధించి హ్యూలెట్ ప్యాకర్డ్ (HP)తో Google భాగస్వామ్యంపై ప్రధాని మోదీ సుందర్ పిచాయ్‌ను అభినందించారు. ఈ భేటీ జరిగిన అనతి కాలంలోనే సుందర్ పిచాయ్ గురువారం కీలక ప్రకటన చేశారు. భారత్ డిజిటల్ వృద్ధిలో విశ్వసనీయ భాగస్వామిగా ఉండటానికి తాము కట్టుబడి ఉన్నామని.. మేక్ ఇన్ ఇండియాకు మద్దతును కొనసాగిస్తున్నామంటూ ప్రకటించారు. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ల తయారీ గురించి కూడా ఆయన కీలక ట్వీట్ చేశారు.
భారతదేశం కోసం ఈ సంవత్సరం Google ప్రకటించిన ఐదు విషయాలు..
- భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ
- AI, స్థానిక భాగస్వామ్యాల ద్వారా మా ఉత్పత్తులను మరింత మెరుగుపరచడం
- భారతదేశంలో అధికారిక క్రెడిట్ పరిధిని విస్తరించడం
- పౌర-కేంద్రీకృత సేవలు – పరిష్కారాల కోసం మా క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఉపయోగించడం
- భారతీయ ఇంటర్నెట్ భద్రతను బలోపేతం చేయడం
సుందర్ పిచాయ్ ట్వీట్..
‘‘మేము పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను స్థానికంగా తయారు చేయడానికి #GoogleforIndia లో ప్లాన్‌లను పంచుకున్నాము. 2024లో మొదటి పరికరాలు అందుబాటులోకి వస్తాయని మేము ఆశిస్తున్నాము. భారతదేశం డిజిటల్ వృద్ధిలో విశ్వసనీయ భాగస్వామిగా ఉండటానికి మేము కట్టుబడి ఉన్నాము.. మేక్ ఇన్ ఇండియాకు మద్దతును అభినందిస్తున్నాము’’..అంటూ ట్వీట్ చేశారు.
We shared plans at #GoogleforIndia to manufacture Pixel smartphones locally and expect the first devices to roll out in 2024. We’re committed to being a trusted partner in India’s digital growth- appreciate the support for Make In India @PMOIndia + MEIT Minister @AshwiniVaishnaw.
— Sundar Pichai (@sundarpichai) October 19, 2023
అంతేకాకుండా.. ‘‘అవసరమైన ప్రభుత్వ ప్రోగ్రామ్‌లపై ఉపరితల AI-ఆధారిత స్థూలదృష్టి, చిన్న వ్యాపారాల కోసం కొత్త సెర్చింగ్ ఫీచర్‌లు, Google Pay ద్వారా అధికారిక క్రెడిట్‌కి సులభంగా యాక్సెస్ చేయడంలో సహాయపడటానికి తాము శోధనలో మరింత దృశ్యమాన + స్థానిక ఉత్పాదక AI అనుభవాన్ని కూడా పరిచయం చేశాం’’.. అంటూ సుందర్ పిచాయ్ ట్వీట్ లో తెలిపారు.
ఈ మేరకు సుందర్ పిచాయ్.. PMOIndia, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xలో షేర్ చేశారు.
కాగా.. న్యూఢిల్లీలో జరిగిన మా తొమ్మిదవ వార్షిక గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు కంట్రీ హెడ్ & వైస్ ప్రెసిడెంట్, గూగుల్ ఇండియా.. సంజయ్ గుప్తా తెలిపారు. ఈ ఈవెంట్‌లో తాము కొత్త ఉత్పాదక AI-ఆధారిత లాంచ్‌లు, భాగస్వామ్యాలు, పెట్టుబడులను ప్రకటించామన్నారు.
గూగుల్ ఫర్ ఇండియా అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..