గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?
వేడి లేదా గోరువెచ్చని నీటిలో స్పూన్ తేనె కలిపి తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆయుర్వేదం ప్రకారం ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
Updated on: Dec 11, 2025 | 8:48 PM

చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగటం అలవాటు. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని భావిస్తుంటారు.

వేడి లేదా గోరువెచ్చని నీటిలో స్పూన్ తేనె కలిపి తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆయుర్వేదం ప్రకారం ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆయుర్వేదం ప్రకారం వేడి పదార్థాలతో తేనె కలిపి తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వేడి నీళ్లలో నిమ్మరసంతోపాటు తేనె కలిపి తాగడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఎసిడిటీ సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ జీర్ణ సమస్యలను తీవ్రతరం చేసి గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి(GERD)ని మరింత పెంచుతుందని అంటున్నారు. అందుకే ఎసిడిటీ ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగడం మానుకోవాలని సూచిస్తున్నారు.

వేడి నీటిలో నిమ్మకాయను తేనెతో కలిపి తాగడం వల్ల దంత సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్‌ను బలహీనపరుస్తుంది. ఇది దంతక్షయానికి దారితీస్తుంది. కాబట్టి తేనెతో నిమ్మకాయ నీరు తాగకపోవడమే మంచిది.




