కస్టమర్లకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఈ ఐదు బ్యాంకులు..
ఆర్బీఐ ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. జీడీపీ వృద్ది, ద్రవ్యోల్బణం తగ్గిన క్రమంలో వడ్డీ రేట్లను తగ్గిస్తూ ప్రజలకు తీపికబురు అందించింది. దీంతో బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. 5 బ్యాంకులు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి.
Updated on: Dec 11, 2025 | 7:56 PM

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును 5.50 శాతం నుంచి 5.25 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. 25 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ తన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీని వల్ల బ్యాంకులు కూడా లోన్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును సవరించాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి.

ప్రస్తుతం ఐదు బ్యాంకులు ఆర్బీఐ నిర్ణయానికి అనుకూలంగా వడ్డీ రేట్లను తగ్గించి కస్టమర్లకు ఉపశమనాన్ని కలిగించాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా లింక్డ్ లెండింగ్ రేటను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని వల్ల అది 8.30 శాతం నుంచి 8.10కి పడిపోయింది. డిసెంబర్ 5 నుంచి ఈ రేట్లను అమల్లోకి తెచ్చింది.

ఇక ఇండియన్ బ్యాంక్ కూడా లెండింగ్ రేటను 8.20 శాతం నుంచి 7.95కి తగ్గించింది. ఇక మార్చినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. డిసెంబర్ 6 నుంచి అమల్లోకి తెచ్చింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వడ్డీ రేట్లను 8.15 నుంచి 7.90 శాతానికి తగ్గించింది. డిసెంబర్ 6 నుంచి వీటిని అమలు చేస్తోంది.

కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా ఆర్బీఐ నిర్ణయంతో MCLRను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 9.55 నుంచి 9.45 శాతానికి తగ్గించింది. డిసెంబర్ 7 నుంచి కొత్తవి అమల్లో ఉన్నాయిప. అటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా వడ్డీ రేట్లను తగ్గించి డిసెంబర్ 6 నుంచి అమలు చేస్తోంది.

బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడంతో కస్టమర్లకు లోన్లపై వడ్డీ రేటు తగ్గనుంది. దీని వల్ల ఈఎంఐలు కూడా తగ్గుతున్నాయి. అలాగే కొత్త తీసుకునే లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతుంది.




