December: డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆలోపు ఈ పనులు చేయకపోతే అవన్నీ కట్
కొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోపు అడుగుపెట్టబోతున్నాం. ఈ లోపు మీరు చేయాల్సిన పనులు కొన్ని మిగిలి ఉన్నాయి. వీటిని పూర్తి చేస్తే మీకు కొత్త ఏడాదిలో ఎలాంటి ఆందోళన ఉండదు. పాన్ కార్డు నుంచి రేషన్ కార్డు వరకు మీరు చేయాల్సిన పనులు ఇవే..
Updated on: Dec 11, 2025 | 7:31 PM

ఇక కేంద్ర ప్రభుత్వం సొంతిల్లు లేనివారికి పీఎం ఆవాస్ యోజన పధకం ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తోంది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకు మాత్రమే సమయం ఉంది. దీని ద్వారా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.2.5 లక్షల సహాయం పొందోచ్చు,.

డిసెంబర్ ముగిసి కొత్త సంవత్సరం రావడానికి ఇంకోన్ని రోజులే సమయం ఉంది. ఈలోపు మీరు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ఇవి చేయకపోతే మీరు నష్టపోయే అవకాశముంది. ఆర్ధికంగా, సేవల పరంగా మీకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇప్పుడు జాగ్రత్త పడి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేలోపు ఈ పనులు చేస్తే మీకు ఏం టెన్షన్ ఉండదు. ఆ వివరాలేంటో చూసేయండి.

ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయనివారికి డిసెంబర్ 31 వరకు బెలేటెడ్ రిటర్న్ దాఖలు చేసే అవకాశం అందుబాటులో ఉంది. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి మీరు మూడో విడత ముందస్తు పన్ను చెల్లించడానికి డిసెంబర్ 15 వరకే టైమ్ ఉంది. ఇది మిస్ అయితే మీకు జరిమానాలు విధించే అవకావముంది. ఇక డిసెంబర్ 31 తర్వాత బెలేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి వెసులుబాటు ఉండదు.

ఆధార్‌తో పాన్ కార్డును లింక్ చేసుకోవడానికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ డిసెంబర్ 31 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. మీరు ఇంకా ఈ పని చేసి ఉండకపోతే వెంటనే పూర్తి చేయండి. లేకపోతే ఆ తర్వాత మీ పాన్ కార్డు రద్దయ్యే అవకాశముంది. దీని వల్ల మీరు ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించలేరు. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ చేయలేని పరిస్థితి కూడా ఎదురుకావోచ్చు.

ఇక కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి డిసెంబర్ 31లోపు గడువు విధించారు. కేవైసీ పూర్తి చేసుకోకపోతే రేషన్ కార్డు నుంచి మీ పేరు తొలగించే అవకాశముంది. దీని వల్ల మీరు రేషన్ సరుకులు పొందలేరు.




