AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్‌హిట్‌ సినిమాకు సీక్వెల్‌.. టైటిల్‌ కూడా చెప్పిన రజనీకాంత్‌

సూపర్‌హిట్‌ సినిమాకు సీక్వెల్‌.. టైటిల్‌ కూడా చెప్పిన రజనీకాంత్‌

Phani CH
|

Updated on: Dec 11, 2025 | 4:47 PM

Share

రజినీకాంత్ తన కెరీర్ బ్లాక్‌బస్టర్ 'నరసింహ' చిత్రానికి సీక్వెల్‌ను ప్రకటించారు. డిసెంబర్ 12న తన 75వ పుట్టినరోజు సందర్భంగా ఒరిజినల్ సినిమా రీ-రిలీజ్ అవుతుందని తెలిపారు. 'నీలాంబరి' అనే టైటిల్‌తో రాబోయే ఈ సీక్వెల్‌కు ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, అభిమానులకు మరో పండగ లాంటి సినిమా అందిస్తానని సూపర్ స్టార్ హామీ ఇచ్చారు.

రజనీకాంత్‌ కెరీర్‌లో నరసింహ మూవీ ఎంత సూపర్‌ హిట్టో అందరికీ తెలుసు. కే.ఎస్‌ రవికుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ రజినీ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. రజినీ, సౌందర్య, రమ్యకృష్ణ తమదైన నటనతో ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌పై రజినీకాంత్ తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘నరసింహ’ చిత్రానికి సీక్వెల్ రాబోతోందని హింట్‌ ఇచ్చారు. ఈ సీక్వెల్ కోసం కథా చర్చలు జరుగుతున్నాయని, అంతా అనుకున్నట్లు జరిగితే అభిమానులకు మరోసారి పండగలాంటి సినిమా అందిస్తానని స్పష్టం చేశారు. డిసెంబర్ 12న తన 75వ పుట్టినరోజు సందర్భంగా ‘నరసింహ’ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్‌ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో నరసింహ సీక్వెల్‌ను ప్రకటించారు. ‘‘ఆడవాళ్లందరూ గేట్లు బద్దలు కొట్టి థియేటర్లలోకి వచ్చిన సినిమా ‘నరసింహ’. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్‌ తీయబోతున్నాం. ఎన్నో సినిమాలు రెండు భాగాలుగా వస్తున్నాయి. అలాంటప్పుడు ఇంత సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ ఎందుకు తీయకూడదు అనిపించింది. రోబో 2.0, జైలర్ 2 చేసేటప్పుడు ఈ ఆలోచన వచ్చింది. నరసింహ రెండో భాగాన్ని ‘నీలాంబరి’ అనే టైటిల్‌తో మీకు అందిస్తాం. ప్రస్తుతం దీని స్టోరీపై చర్చలు నడుస్తున్నాయి అని రజనీకాంత్‌ చెప్పారు. ఈ నరసింహ కథను తానే రాశానని, తన స్నేహితుల పేర్లతో నిర్మించానని వెల్లడించారు. నరసింహ చిత్రానికి టైటిల్‌ కూడా తానే సూచించానని టైటిల్‌ వినగానే డైరెక్టర్‌ ఆశ్చర్యపోయారని, పాతగా ఉందని చెప్పారు. అయితే ఆ టైటిల్‌లో ఓ వైబ్రేషన్‌ ఉందని చెప్పి తానే ఒప్పించానని పేర్కొన్నారు రజినీ. ఈ ప్రకటనతో ‘నరసింహ’ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చనిపోయిందనుకున్న కుమార్తె.. రెండు నెలల తర్వాత.. ట్విస్ట్ సూపర్

JioHotstar: ఐసీసీకి జియోహాట్‌స్టార్ బిగ్‌ షాక్

ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయా ?? RBI క్లారిటీ

షాకిస్తున్న కొత్త ఆదాయ పన్ను రూల్స్‌ !! ఇక వీరికి దబిడి దిబిడే

12 గంటల ప్రయాణం ఇక 5 గంటల్లోనే.. అబ్బా సాయి రామ్