Stephen Review: మరీ ఎక్కువ హైప్ ఇస్తున్నారు.. స్టీఫెన్ రివ్యూ
స్టీఫెన్ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకుందా? నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం ఆడిషన్ పేరుతో హత్యలు చేసే ఓ యువకుడి కథ. ఇన్‌స్టాలో వైరల్ అయినంత గొప్పగా లేకున్నా, కొన్ని ఆసక్తికర మలుపులు, ముఖ్యంగా చివరి 20 నిమిషాలు మాత్రం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. ఈ షార్ట్ రివ్యూలో సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.
ఈ మధ్య సైకలాజికల్ థ్రిల్లర్స్‌కు వ్యూవర్స్ పెరుగుతున్నారు. ఓటీటీల్లో జల్లడ పట్టీ మరీ మంచి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ను చూస్తున్నారు. అయితే అలా ఈ థ్రిల్లర్ సినిమాలను చూసే వారికి నెక్ట్స్ లెవల్ థ్రిల్ ఇస్తోందనే కామెంట్ తెచ్చుకుంటోంది స్టీఫెన్ మూవీ. సైకలాజికల్ థ్రిల్లర్స్‌కు బ్యాంక్‌లా మారిన నెట్‌ఫ్లిక్స్‌లోనే ఈ మూవీ కూడా స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నట్టు నెక్ట్స్ లెవల్లో ఉందా అనేది తెలుసుకోవాలంటే.. ఈ షార్ట్ రివ్యూను చూసేయండి! ఇంతకీ స్టీఫెన్ మూవీ కథేంటంటే..? స్టీఫెన్ జబరాజ్ అలియాస్ గోమతి శంకర్ అనే కుర్రాడు.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఏకంగా తొమ్మిది మంది అమ్మాయిలని హత్య చేస్తాడు. తీరా పోలీసులు ఇతడిని పట్టుకుందామని అనుకునేసరికి దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోతాడు. కోర్ట్‌లోనూ ఇదే విషయాన్ని ఒప్పుకొంటాడు. దీంతో 15 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతిస్తుంది. పోలీసులు విచారణ మొదలుపెడతారు. యాజ్ యూజ్‌వల్ ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు బయటపడతాయి. ఇంతకీ స్టీఫెన్ ఎవరు? అతడి గతమేంటి? తొమ్మిది హత్యలు చేయడానికి కారణమేంటి? మధ్యలో కృతిక ఎవరు? అనేది రిమైనింగ్ స్టోరీ. సైకలాజికల్ థ్రిల్లర్స్..! వీటిని సరిగా తీయాలే కానీ.. ఫిల్మ్ లవర్స్‌కు అట్ మోస్ట్ కిక్కిస్తాయి. సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటాయి. కానీ ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న స్టీఫెన్ మాత్రం ఆ రేంజ్లో లేదనే చెప్పాలి. ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని తెరకెక్కించిన విధానం బోర్ కొట్టిస్తుంది. తొలి గంటలో జరిగే సీన్స్ అన్నీ చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. తర్వాత నుంచి స్టోరీలో ఒక్కో ట్విస్ట్ రివీల్ అయ్యేసరికి.. పర్లేదనిపిస్తుంది. ఆడిషన్ కోసం పిలిచి అమ్మాయిలని స్టీఫెన్ హత్య చేయడం అనే పాయింట్‌తో సినిమా మొదలవుతుంది. తర్వాత ఇతడి కోసం పోలీసులు వెతకడం, ఇతడేమో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోవడం.. కోర్ట్‌లో హాజరు పరచడం.. తర్వాత పోలీస్ కస్టడీకి స్టీఫెన్‌ని అప్పగించడం ఇలా సీన్స్ చకచకా వెళ్తాయి. విచారణ మొదలైన తర్వాత స్టీఫెన్, అతడి గతం, తల్లిదండ్రులు ప్రవర్తన.. స్టీఫెన్ ఇలా ఎందుకు తయారయ్యాడు అనేది మనకు తెలుస్తుంది. కానీ అమ్మాయిలని ఎందుకు చంపాడు అనే ప్రశ్న మాత్రం మన మదిలో ఉండనే ఉంటుంది. దానికి సెకండాఫ్‌లో సమాధానం దొరుకుతుంది. సినిమా అంతా ఓకే ఓకే ఉంటుంది గానీ చివరి 20 నిమిషాలు మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ మోస్ట్‌లీ చాలా మంది ఊహిస్తారు. అండ్ దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది. దానికి కూడా మేకర్స్ హింట్ ఇచ్చి వదిలారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే
అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు
గుండెల్ని పిండేసే ఘటన.. అలా చేయడానికి మీకు మనసు ఎలా చేశారురా
సూపర్‌హిట్ సినిమాకు సీక్వెల్.. టైటిల్ కూడా చెప్పిన రజనీకాంత్
చనిపోయిందనుకున్న కుమార్తె.. రెండు నెలల తర్వాత.. ట్విస్ట్ సూపర్
నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే
అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు
గుండెల్ని పిండేసే ఘటన.. అలా చేయడానికి మీకు మనసు ఎలా చేశారురా
చనిపోయిందనుకున్న కుమార్తె.. రెండు నెలల తర్వాత.. ట్విస్ట్ సూపర్
ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!
ప్రభుత్వం కొత్త యాప్.. రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు
జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఎప్పుడొచ్చి మీద పడుతుందో.. టెన్షన్

