గుండెల్ని పిండేసే ఘటన.. అలా చేయడానికి మీకు మనసు ఎలా చేశారురా
బీహార్‌లోని అక్బర్‌పూర్ హాస్పిటల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తల్లి మరణించాక, అజయ్ సావోకు అంబులెన్స్, స్ట్రెచర్ నిరాకరించబడింది. స్ట్రెచర్ కోసం భార్య, కుమారుడిని హామీగా ఉంచమని సిబ్బంది డిమాండ్ చేశారు. నిస్సహాయంగా, అజయ్ తన కుటుంబాన్ని వదిలి, తల్లి మృతదేహాన్ని స్ట్రెచర్‌పై ఇంటికి తీసుకెళ్లాడు. ఈ వీడియో వైరల్ కావడంతో హాస్పిటల్ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం వ్యక్తమవుతోంది.
బీహార్ లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అజయ్ సావో అనే వ్యక్తి తన తల్లి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమెను అక్బర్‌పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ హాస్పిటల్‌లో ఆమెను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతూనే ఆమె మరణించింది. దీంతో తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని అజయ్ హాస్పిటల్ సిబ్బందిని కోరాడు. అందుకు హాస్పిటల్ సిబ్బంది నిరాకరించినట్టు అతను ఆరోపించాడు. చేసేదేమి లేక కనీసం స్ట్రెచర్ అయిన ఇవ్వాలని.. తల్లి మృతదేహాన్ని దాని సహాయంతోనైనా ఇంటికి తీసుకెళ్తానని అజయ్ సిబ్బందని కోరాడు. హాస్పిటల్ సిబ్బంది అందుకు కూడా మొదట నిరాకరించారు.స్ట్రెచర్ కావాలంటే ఏదైనా హామీగా ఉంచాలని చెప్పారు. దీంతో అజయ్ తన భార్య, కుమారుడిని హాస్పిటల్ దగ్గరే హామీగా ఉంచి స్ట్రెచర్‌ను తీసుకెళ్లాడు. అలా తల్లి శవాన్ని స్ట్రెచర్‌పై ఇంటికి తీసుకెళ్లి మళ్లి దాన్ని తెచ్చి హాస్పిటల్‌కు ఇచ్చి, తన భార్య, కుమారుడిని తీసుకెళ్లాడు. ఈ ఘటనపై అతని బంధువులు స్పందిస్తూ..హాస్పిటల్ సిబ్బంది చాలా దారుణంగా వ్యవహరించారని.. హాస్పిటల్‌లో అంబులెన్సులు ఉన్నప్పటికీ వాటిని ఇచ్చేందుకు వారు నిరాకరించారని ఆరోపించారు. అజయ్ తన తల్లి శవాన్ని స్ట్రెచర్‌పై తోసుకెళ్తుండగా కొందరు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.ఈ వీడియో చూసిన జనాలు హాస్పిటల్ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. అయితే ఈ ఘటనపై సంబంధిత హాస్పిటల్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూపర్‌హిట్ సినిమాకు సీక్వెల్.. టైటిల్ కూడా చెప్పిన రజనీకాంత్
చనిపోయిందనుకున్న కుమార్తె.. రెండు నెలల తర్వాత.. ట్విస్ట్ సూపర్
JioHotstar: ఐసీసీకి జియోహాట్‌స్టార్ బిగ్ షాక్
ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయా ?? RBI క్లారిటీ
షాకిస్తున్న కొత్త ఆదాయ పన్ను రూల్స్ !! ఇక వీరికి దబిడి దిబిడే
గుండెల్ని పిండేసే ఘటన.. అలా చేయడానికి మీకు మనసు ఎలా చేశారురా
చనిపోయిందనుకున్న కుమార్తె.. రెండు నెలల తర్వాత.. ట్విస్ట్ సూపర్
ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!
ప్రభుత్వం కొత్త యాప్.. రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు
జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఎప్పుడొచ్చి మీద పడుతుందో.. టెన్షన్
ప్రపంచంలోనే అత్యంత పొట్టి బర్రె మనదే..
విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయులు ధర్నా..

