Spam Call: స్పామ్ కాల్స్ భరించలేకపోతున్నారా..? ఒక్క క్లిక్ ఇస్తే చాలు.. ఇక ఆ నెంబరే పనిచేయదు..
Spam call protect: స్పామ్ కాల్స్‌కి చెక్ పెట్టెందుకు కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఇప్పటివరకు ఆయా టెలికం ఆపరేటర్లు, ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లు, లేదా ఫోన్లోనే ఇన్బిల్ట్‌గా ఉన్నా కొన్ని ఆప్షన్స్ ఇది మాత్రమే స్పాన్ కాల్స్‌ను ఆపగలిగేవి. ఇవి వాడుతున్నప్పటికీ రకరకాల మార్కెటింగ్ కంపెనీలు వేరువేరు నెంబర్ నుంచి కాల్ చేస్తూ కస్టమర్లను విసిగించేవి.

Spam call protect: స్పామ్ కాల్స్‌కి చెక్ పెట్టెందుకు కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఇప్పటివరకు ఆయా టెలికం ఆపరేటర్లు, ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లు, లేదా ఫోన్లోనే ఇన్బిల్ట్‌గా ఉన్నా కొన్ని ఆప్షన్స్ ఇది మాత్రమే స్పాన్ కాల్స్‌ను ఆపగలిగేవి. ఇవి వాడుతున్నప్పటికీ రకరకాల మార్కెటింగ్ కంపెనీలు వేరువేరు నెంబర్ నుంచి కాల్ చేస్తూ కస్టమర్లను విసిగించేవి. రోజురోజుకి స్పామ్ కాల్స్ సంఖ్య పెరుగుతుండడం, ఈ రకమైన కాల్స్ తోనే సైబర్ క్రైమ్స్ జరుగుతుండడం ప్రస్తుతం.. పరిస్థితి సీరియస్‌గా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన అంతే సీరియస్ గా దృష్టి పెట్టింది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్తగా ఒక మొబైల్ యాప్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. TRAI పేరుతో యాప్ స్టోర్, ప్లే స్టోర్‌లలో ఈ అప్లికేషన్ దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకొని స్పామ్ కాల్ నెంబర్ ఎంటర్ చేసి, మీకు ఎప్పుడు కాల్ వచ్చిందో కొన్ని వివరాలు దాంట్లో నమోదు చేస్తే చాలు 24 గంటల్లో ఆ నెంబర్ ని కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేస్తుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఆ నెంబర్ నుంచి ఎక్కడికీ కాల్స్ వెళ్లకుండా నియంత్రిస్తుంది. జస్ట్ వన్ క్లిక్ అంతే దేశంలో ఎక్కడా స్పామ్ నెంబర్ పనిచేయదు.
మీకు స్పామ్ మెసేజ్ వస్తున్నా ట్రాయ్ ఆప్ లో ఆ మెసేజ్ ని కాపీ పేస్ట్ చేసి, ఆ మెసేజ్ నెంబర్ ఉన్నట్లయితే అది కూడా ఎంటర్ చేస్తే ఇక మీకు ఎప్పుడు స్పామ్ మెసేజ్‌లు రావు. మీకు ఇలాంటి విసిగించే కాల్స్ లేదా, మీకు అనుమానం వచ్చిన నెంబర్లను వెంటనే ట్రాయ్ లో నమోదు చేయండి. అలా అని మీకు తెలిసిన వాళ్ళ నెంబర్లను ఉద్దేశపూర్వకంగా వారిని ఇబ్బంది పెట్టేందుకు ఎంటర్ చేస్తే మీపై కూడా చర్యలు ఉంటాయి.. జాగ్రత్త.. అని సూచిస్తున్నారు అధికారులు..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




