ఎన్నికల్లో ఒక ఓటు ఎంత ముఖ్యమో నిజామాబాద్ జిల్లాలో రుజువైంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఓటరును పోలింగ్ కేంద్రానికి తీసుకురావడానికి అభ్యర్థులు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లోని జాడి జమాల్పూర్ గ్రామంలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని డాక్టర్ల అనుమతితో అభ్యర్థి కోరిక మేరకు అంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేయించారు.