Smart TVs: పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు.. ఏకంగా 64శాతం వరకూ డిస్కౌంట్.. ఇంట్లోనే థియేటర్ కావాలనుకునే వారికి బెస్ట్ చాయిస్..
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, టాబ్లెట్‌ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా బహుళ ఉత్పత్తులపై అమెజాన్ గొప్ప డీల్స్ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఇదే క్రమంలో స్మార్ట్ టీవీలై అదిరే ఆఫర్లను అందిస్తోంది. కొన్ని బ్రాండ్ల టీవీలపై ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో 50 అంగుళాలు లేదా అంతకన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్న టీవీలపై అందుబాటులో ఉన్న ఆఫర్లను ఇప్పుడు చూద్దాం..

ఇంట్లో థియేటర్ అనుభవం కావాలని కోరుకుంటున్నారా? అందుకోసం మంచి 50 అంగుళాలు లేదా అంతకన్నా ఎక్కువ పరిమాణంలో స్మార్ట్ టీవీ కావాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మిస్ అవ్వొద్దు. ఇటీవల కాలంలో స్మార్ట్ టీవీల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఓటీటీ ప్లాట్ ఫారంలకు జనాలు అలవాటు పడటం, యూట్యూబ్ టీవీలోనే వస్తుండటంతో అందరూ స్మార్ట్ టీవీల బాట పడుతున్నారు. అందులోనూ వీటి ధరలు కూడా బాగా తగ్గడంతో ఇవి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పైగా ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో అన్ని ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో భారీ ఆఫర్లు నడుస్తున్నాయి. అన్ని వస్తువులు, గ్యాడ్జెట్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఆకర్షిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ ఇటీవల గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023ప్రారంభించింది. అక్టోబర్ 7న ప్రైమ్ మెంబర్లకు 8న సాధారణ వినియోగదారులకు సేల్ ను అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి ఈ సేల్ అక్టోబర్ 15తో ముగిసినా.. పండుగల సీజన్ నేపథ్యంలో ఇంకా సేల్ కొనసాగిస్తోంది. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, టాబ్లెట్‌ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా బహుళ ఉత్పత్తులపై అమెజాన్ గొప్ప డీల్స్ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఇదే క్రమంలో స్మార్ట్ టీవీలై అదిరే ఆఫర్లను అందిస్తోంది. కొన్ని బ్రాండ్ల టీవీలపై ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో 50 అంగుళాలు లేదా అంతకన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్న టీవీలపై అందుబాటులో ఉన్న ఆఫర్లను ఇప్పుడు చూద్దాం..
బ్యాంక్ తగ్గింపు కూడా..
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్ అందించే సేల్ డిస్కౌంట్‌లను పక్కన పెడితే కస్టమర్లు అదనపు బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఈ బ్యాంక్ ఆఫర్‌లు ఏదైనా ఉత్పత్తి అసలు డీల్ ధర కంటే తక్కువ ధరకు తగ్గించడంలో సహాయపడతాయి. దాదాపు అన్ని వస్తువుల కొనుగోలుపై ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లకు అమెజాన్ తక్షణం 10 శాతం తగ్గింపును అందిస్తోంది. కొన్ని అంశాలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎక్స్ చేంజ్ ఎంపికను కూడా అందించవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ డీల్ ధర, బ్యాంక్ డిస్కౌంట్లను కలిపి వర్తించినప్పుడు ప్రభావవంతమైన ధరను మరింత తగ్గిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు , టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, పెద్ద గృహోపకరణాలు అన్నింట్లోనూ ఈ తగ్గింపు లభిస్తుంది.
టీవీలపై బెస్ట్ డీల్స్ ఇవే..
- స్మార్ట్ టీవీలపై అమెజాన్ అందిస్తున్న బెస్ట్ డీల్స్ లో జియోమీ 55 అంగుళాల ఓఎల్ఈడీ టీవీ ఒకటి. ఈ స్మార్ట్ టీవీ ఐమ్యాక్స్ ఎన్ హ్యాంస్డ్ డిస్‌ప్లే, 4కే అల్ట్రా హెచ్డీ(3,840 x 2,160 పిక్సెల్‌లు) రిజల్యూషన్ ఉంటుంది. దీని ఎంఆర్పీ ధర రూ. 1,99,999 కాగా.. 63శాతం డిస్కౌంట్ తో అమెజాన్ దీనిని కేవలం రూ. 74,999కే కొనుగోలు చేయొచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. దీని సాయంతో మరో రూ. 5,000 తగ్గే అవకాశం ఉంటుంది.
- అదే విధంగా ఇదే సేల్లో మరొక టీవీపై అదిరే డీల్ అందుబాటులో ఉంది. అదేంటంటే 65-అంగుళాల టీసీఎల్ స్మార్ట్ ఓఎల్ఈడీ గూగుల్ టీవీ. దీని ధర రూ. 59,990గా ఉంది. వాస్తవానికి దీని అసలు దర రూ. 1,66,990కాగా అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ లో ఏకంగా 64 శాతం తగ్గింపుపై లభిస్తోంది.
- అలాగే రెడ్ మీ 4కే అల్ట్రా 65 అంగుళాల టీవీ అసలు ధర రూ. 74,999కాగా, అమెజాన్ ఫెస్టివ్ సేల్లో రూ. 55,999కే కొనుగోలు చేయొచ్చు.
- హైసెన్స్ బెజెల్‌లెస్ సిరీస్ 43-అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 44,990కాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో రూ. 24,990కే దక్కించుకోవచ్చు.
- రెడ్మీ ఎల్ఈడీ టీవీ ఎక్స్50 స్మార్ట్ 50 అంగుళాల టీవీ ఎంఆర్పీ ధర రూ. 44,999కాగా, ఆఫర్ పై కేవలం రూ. 29,999కే లభిస్తోంది.
- ఎన్యూ ఎల్ఈడీ 65యూడబ్ల్యూఏ1 65 అంగుళాల టీవీ అసలు ధర రూ. 94,999కాగా.. ఫెస్టివల్ తగ్గింపుపై రూ. 46,999కే వస్తోంది.
- జియోమీ ఓఎల్ఈడీ విజన్ టీవీ 55 అంగుళాలు అసలు ధర రూ. 1,99,999కాగా, దీనిని అమెజాన్ కేవలం రూ. 74,999కే లభిస్తోంది.
- యాసర్ సిరీస్ 4కే అల్ట్రా 50-అంగుళాల స్మార్ట్ టీవీ ఎంఆర్పీ ధర రూ. 40,990కాగా.. అమెజాన్ లో కేవలం రూ. 27,999కే దొరకుతోంది.
- టీసీఎల్ గూగుల్ టీవీ 65సీ645.. 65 అంగుళాల స్మార్ట్ టీవీని రూ. 59,990కే కొనుగోలు చేయొచ్చు.. దీని అసలు ధర రూ. 1,66,990గా ఉంది.
- తోషిబా గూగుల్ టీవీ 75సీ350ఎంపీ 75-అంగుళాల టీవీ ఎంఆర్పీ ధ రూ. 1,14,990 కాగా.. అమెజాన్ సేల్లో రూ. 74,990కి కొనుగోలు చేయొచ్చు.
- ఎల్‌జీ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ 65-అంగుళాల టీవీ ధర రూ. 79,990గా ఉండగా.. అమెజాన్ ఆఫర్లలో కేవల రూ. 39,990కే దక్కించుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..