హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి హాంక్ మోర్, వెయిట్ మోర్ అనే కొత్త నిబంధనను అమలు చేయనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అనవసరంగా హారన్ కొడితే, సెన్సార్లు గుర్తించి రెడ్ సిగ్నల్ సమయాన్ని పెంచుతాయి. ముంబై, బెంగళూరులో విజయవంతమైన ఈ విధానం హైదరాబాద్లో కూడా మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నారు.