Kodali Nani: 18 నెలల తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలో మళ్ళీ కనిపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణలో పాల్గొని, కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా దూరంగా ఉన్నానని, ఆరు నెలల్లో ప్రజల మధ్యకు వస్తానని తెలిపారు.