AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Hack: బీ అలర్ట్.. ఈ సంకేతాలు కనిపిస్తే మీ వాట్సప్ హ్యాక్ అయినట్లే.. వెంటనే జాగ్రత్త పడండి

ఈ రోజుల్లో ప్రతీఒక్కరి ఫోన్లలో వాట్సప్ అనేది ఉంటుంది. వాట్సప్‌లో మన వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకింగ్ డీటైల్స్ ఉంటాయి. దీంతో సైబర్ నేరగాళ్లు దీనిని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం స్పామ్ లింక్‌లు పంపి వాట్సప్ హ్యాక్ చేస్తున్నారు. అప్పుడు..

WhatsApp Hack: బీ అలర్ట్..  ఈ సంకేతాలు కనిపిస్తే మీ వాట్సప్ హ్యాక్ అయినట్లే.. వెంటనే జాగ్రత్త పడండి
Whats App
Venkatrao Lella
|

Updated on: Dec 10, 2025 | 3:39 PM

Share

Phone Hacking: ఇటీవల ఫోన్ హ్యాకింగ్, సోషల్ మీడియా అకౌంట్ల హ్యాక్ ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. తమ ఫోన్ హ్యాక్ అయిందని, సోషల్ మీడియా అకౌంట్లను కూడా హ్యాక్ చేశారంటూ చాలామంది పోస్ట్‌లు పెడుతున్న ఘటనలు మనం ఇటీవల చూస్తున్నాం. ఫోన్‌ను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. వారి నెంబర్ల ద్వారా స్నేహితులు, కుటుంబసభ్యులకు డబ్బులు రిక్వెస్ట్ చేస్తూ మెస్సేజ్‌లు పెడుతున్నారు. ఇది నిజమేననుకుని కొంతమంది డబ్బులు కొడతున్నారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు ఫోన్ హ్యాక్ చేశారని తెలుసుకుని ఖంగు తింటున్నారు. ఇటీవల వాట్సప్ హ్యాక్ చేసి ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల ద్వారా డబ్బులు కొల్లగొడుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. మీ వాట్సప్ హ్యాక్ అయననట్లు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వాట్సాప్ లాగౌట్

మీరు వాట్సప్ వాడుతున్నప్పుడు మీకు విచిత్ర సంఘటనలు ఎదురైతే హ్యాక్ అయినట్లు లెక్క. మీరు వాట్సప్ యాక్సెస్ చేస్తున్నప్పుడు సడెన్‌గా “Your phone number is no longer registered” అనే మెస్సేజ్ స్క్రీన్‌పై కనిపిస్తే జాగ్రత్త పడాలి. అలాగే మీ వాట్సప్ అకౌంట్ ప్రతీసారి మీరు ఏం చేయకుండానే లాగౌట్ అవుతుంటే అలర్ట్ అవ్వాల్సిందే. మీ ఫోన్‌లో లాగౌట్ అయిందంటే మీ నెంబర్‌పై వేరేవాళ్లు వాట్సప్ వాడుతున్నట్లు అర్థం చేసుకోవాలి.

మీరు పంపకపోయినా మెస్సేజ్‌లు

మీరు మెస్సేజ్‌లు పంపకపోయినా మీ ఫ్రెండ్స్ నుంచి ఏదైనా మెస్సేజ్‌కి రిప్లై వస్తే మీరు జాగ్రత్త పడండి. మీ వాట్సప్ హ్యాక్ చేసినవారు ఆ మెస్సేజ్ పంపి ఉండొచ్చు. ఇక రోజుకు ఒకసారైనా మీ వాట్సప్‌తో కనెక్ట్ అయిన డివైస్‌లను చెక్ చేసుకోండి. లింక్డ్ డివైస్‌ ఆప్షన్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవడం మంచిది. వేరేవాళ్లు వేరే డివైస్‌లో లాగిన్ చేస్తే మీకు దీని ద్వారా వెంటనే తెలిసిపోతుంది. ఒకవేళ మీ ప్రమేయం లేకుండా వాట్సప్ ఫోన్ బ్యాగ్రౌండ్‌లో వర్క్ అవుతుంటే డౌట్ పడాల్సిందే. వాట్సప్‌లోకి మాల్‌వేర్ లేదా స్పైవేర్స్ ఎంటర్ అయినప్పుడు ఇలా బ్యాగ్రౌండ్‌లో వర్క్ అవుతూ ఉంటుంది. ఈ సమయంలో మీ బ్యాటరీ త్వరగా వేడెక్కడంతో పాటు ఛార్జింగ్ పడిపోతుంది.

గ్రూపుల్లో యాడ్ అయితే..?

ఒక్కొక్కసారి మీ ప్రమేయం లేకుండా మీ నెంబర్ వాట్సప్ గ్రూపుల్లో యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే వాట్సప్ కాంటాక్ట్ లిస్ట్‌లోకి కొత్త నెంబర్లు యాడ్ అయినా మీరు జాగ్రత్త పడాలి. ఈ సంకేతాల ద్వారా మీరు వాట్సప్ హ్యాక్ అయినట్లు గుర్తించవచ్చు.

ఫోన్‌లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. మీ వాట్సప్ హ్యాక్ అయినట్లే
ఫోన్‌లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. మీ వాట్సప్ హ్యాక్ అయినట్లే
ఈ శివుడికి చెరకు నైవేద్యం పెడితే ఒంట్లో షుగర్ మాయం..!
ఈ శివుడికి చెరకు నైవేద్యం పెడితే ఒంట్లో షుగర్ మాయం..!
మద్యం కాదు.. ఇదే డేంజరస్.. ఈ డ్రింక్ తాగారో మీ కిడ్నీలు గుల్లే
మద్యం కాదు.. ఇదే డేంజరస్.. ఈ డ్రింక్ తాగారో మీ కిడ్నీలు గుల్లే
8 ఏళ్ల తరువాత హీరోయిన్‌ లైంగిక ఆరోపణల కేసు నుంచి హీరోకు విముక్తి
8 ఏళ్ల తరువాత హీరోయిన్‌ లైంగిక ఆరోపణల కేసు నుంచి హీరోకు విముక్తి
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్‌.. ఒక్క మాటతో
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్‌.. ఒక్క మాటతో
స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ.. బ్యూటిఫుల్ ఫొటోస్
స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ.. బ్యూటిఫుల్ ఫొటోస్
మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి
మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి
శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఇవి ఉంటే వెంటనే అకౌంట్‌లో..
శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఇవి ఉంటే వెంటనే అకౌంట్‌లో..
రాత్రి 8 తర్వాత ఈ గుడిలోకి వెళ్లాలంటే పూజారులకే హడల్!
రాత్రి 8 తర్వాత ఈ గుడిలోకి వెళ్లాలంటే పూజారులకే హడల్!
క్రేజీ ప్లాంట్ లేడీ అంటూ రాశిఖన్నా బ్యూటిఫుల్ ఫొటోస్
క్రేజీ ప్లాంట్ లేడీ అంటూ రాశిఖన్నా బ్యూటిఫుల్ ఫొటోస్