AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకున్నారా..?

Dwcra Womens: ఏపీలోని కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు తోడ్పాటు అందించేందుకు అనేక పథకాలు అందిస్తోంది. అందులో భాగంగా వారికి వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల అకౌంట్లో రూ.15 వేలు జమ చేయాలని నిర్ణయించింది.

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకున్నారా..?
Dwacra Womens
Venkatrao Lella
|

Updated on: Dec 10, 2025 | 3:09 PM

Share

Andhra News: ఏపీలోని మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. నూతనంగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలన్నింటికీ రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ తాజాగా ప్రకటించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2 వేల కొత్త డ్వాక్రా సంఘాలకు రూ.15 వేల చొప్పున అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆయా సంఘాల సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ డబ్బులు సదరు డ్వాక్రా సంఘం బ్యాంక్ అకౌంట్లోనే ఉంటాయి. సంఘం నిధి పెంచేందుకు, సభ్యుల అవసరానికి అనుగుణంగా అంతర్గతంగా అప్పులు మంజూరు చేసుకోవడంతో పాటు బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో డ్వాక్రా మహిళలకు రుణం మంజూరయ్యేందుకు ఈ రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది.

త్వరలో డ్వాక్రా మహిళల అకౌంట్లో రూ. 15 వేలు జమ కానున్నాయి. కొత్త సంఘాల జాబితాను ఇప్పటికే జిల్లాలకు అధికారులు పంపారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఫండ్ ద్వారా డ్వాక్రా మహిళలకు ఆర్ధిక భరోసా లభించనుంది. డ్వాక్రా మహిళల అభివృద్ది కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. వారికి వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. అన్నీ బ్యాంకులు వీరికి రుణాలు సులువుగా అందిస్తున్నాయి. తీసుకున్న రుణాన్ని డ్వాక్రా మహిళలు నెలనెలా ఈఎంఐ రూపంలో చెల్లించుకునే అవకాశముంది.

గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్లు

గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం భారీగా నిధులు మంజూరు చేసింది. గ్రామాల్లో రోడ్ల డెవలప్‌మెంట్‌కు ఫేజ్ -1లో భాగంగా రూ. 2123 కోట్లు నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 1299 రోడ్లు నిర్మించనుండగా.. మొత్తం పొడవు 4007 కిలోమీటర్లగా ఉంది. 26 జిల్లాల్లోని 157 నియోజకవర్గాల్లో రోడ్లను నిర్మించనున్నారు. 484 మండాల్లో నిర్మించనున్న ఈ రోడ్లకు రూ.2123 కోట్లు ఖర్చు చేయనున్నారు.

మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి
మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి
శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఇవి ఉంటే వెంటనే అకౌంట్‌లో..
శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఇవి ఉంటే వెంటనే అకౌంట్‌లో..
రాత్రి 8 తర్వాత ఈ గుడిలోకి వెళ్లాలంటే పూజారులకే హడల్!
రాత్రి 8 తర్వాత ఈ గుడిలోకి వెళ్లాలంటే పూజారులకే హడల్!
క్రేజీ ప్లాంట్ లేడీ అంటూ రాశిఖన్నా బ్యూటిఫుల్ ఫొటోస్
క్రేజీ ప్లాంట్ లేడీ అంటూ రాశిఖన్నా బ్యూటిఫుల్ ఫొటోస్
రోహిత్ శర్మ ప్లేస్‌కు ముప్పు తెచ్చిన విరాట్ కోహ్లీ..
రోహిత్ శర్మ ప్లేస్‌కు ముప్పు తెచ్చిన విరాట్ కోహ్లీ..
రైళ్లల్లో ఉచిత వాటర్ బాటిల్ బంద్.. రైల్వేశాఖ క్లారిటీ
రైళ్లల్లో ఉచిత వాటర్ బాటిల్ బంద్.. రైల్వేశాఖ క్లారిటీ
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
ఉద్యోగులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ATM నుంచి పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా
ఉద్యోగులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ATM నుంచి పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా
దీపం వెలిగించినా శాంతి లేదా? వెంటనే ఈ మార్పు చేయండి
దీపం వెలిగించినా శాంతి లేదా? వెంటనే ఈ మార్పు చేయండి