Andhra Pradesh: దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్.. కాశీ తర్వాత ఇక్కడే..
దేవతా వృక్షాలుగా పిలుచుకునే వృక్షాల్లో కదంబ వృక్షాల కథవేరు.. కాశీ పుణ్యక్షేత్రం తరువాత ఒక్క త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆలయం ఆవరణలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఎరుపురంగులో ఉండే కదంబ పూలు విశేషంగా భక్తులను ఆకర్షించడమే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయని చెబుతారు.

దేవతా వృక్షాలుగా పిలుచుకునే వృక్షాల్లో కదంబ వృక్షాల కథవేరు.. కాశీ పుణ్యక్షేత్రం తరువాత ఒక్క త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆలయం ఆవరణలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఎరుపురంగులో ఉండే కదంబ పూలు విశేషంగా భక్తులను ఆకర్షించడమే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయని చెబుతారు. ఈ వృక్షాలను సాక్షాత్తూ పార్వతీదేవి స్వరూపంగా భావించి మహిళలు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కదంబవాసినిగా పేరున్న పార్వతీదేవి ఈ వృక్షాల దగ్గర వనవాసం చేశారని ప్రతీతి.. నిత్యం పచ్చగా ఉండే ఈ వృక్షాలను సంరక్షించడం అంటే ధర్మాన్ని పరిరక్షించడమే అని పండితులు చెబుతారు.
దేవతావృక్షాల్లో ప్రథమస్థానం ఈ కదంబవృక్షాలదే.. ప్రకాశంజిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో గతంలో ఈ వృక్షాలు ఎక్కువగా కనిపించేవి.. రాను రాను వీటి సంఖ్య తగ్గిపోవడంతో ఆలయ నిర్వాహకులు, పండితులు ఈ వృక్షాలను సంరక్షించడంతో తిరిగి వీటి సంఖ్య పెరిగింది.. అమ్మవారి ఆలయం చెరువు కట్టపై కదంబ వృక్షాలు ఎక్కువగా కనిపిస్తాయి.. కాశీ పుణ్యక్షేత్రం తర్వాత కదంబ వృక్షాలు త్రిపురాంతకంలోని అమ్మవారి ఆలయ పరిసరాల్లోనే ఉన్నాయని స్థలపురాణాలు, చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారు కదంబవాసిని కావడం వల్లే ఇవి ఎక్కువగా ఇక్కడే కనిపిస్తాయని చెబుతారు.

Kadamba Tree Special
అలాగే శ్రీకృష్ణ భగవానుడికి కదంబ వృక్షాలంటే ఎంతో ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. రాధాకృష్ణుల ప్రణయగాధలు కూడా ఈ వృక్షాల కిందే ప్రారంభమయ్యాయని చెబుతారు. రాధాకృష్ణులు ఈ చెట్టు కిందే ఎక్కువగా విశ్రాంతి తీసుకునేవారట.. లలితసహస్రనామంలో కూడా త్రిపురాంతకం, కాశీ క్షేత్రాల్లో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవని పేర్కొన్నట్టు పండితులు చెబుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




