అగ్రనటుడు రాంచరణ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ క్రమంలో, జపాన్ నుంచి వచ్చిన కొందరు అభిమానులు రాంచరణ్‌ను హైదరాబాద్‌లో కలిశారు. తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తూ, ఆయన సినిమాల గురించి మాట్లాడి, భావోద్వేగానికి గురయ్యారు. రాంచరణ్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు.