భూమ్మీదకు ఏలియన్స్ చూసిన వాళ్లకు కాలిన గాయాలు, మచ్చలు
గ్రహాంతరవాసుల ఉనికిపై పరిశోధనలు కొనసాగుతుండగా, న్యూయార్క్ పోస్ట్ డాక్యుమెంటరీ సంచలనం సృష్టించింది. 1964లో హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో గ్రహాంతర జీవులను సిబ్బంది చూశారని, ఈ విషయం అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సీనియర్‌కు కూడా తెలుసని డాక్యుమెంటరీ వెల్లడించింది. గ్రహాంతరవాసుల సంబంధిత నివేదికలు, సిబ్బందికి జరిగిన గాయాలపై చర్చ మళ్లీ ఊపందుకుంది.
కేవలం భూమ్మీదే జీవజాలం ఉందా? అంతరిక్షంలో భూమి లాంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ గ్రహాంతరవాసులు జీవిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే, గ్రహాంతరవాసులపై కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ ఏదో ఒక గ్రహంపై జీవం ఉండే అవకాశముందని విశ్వసిస్తున్నారు. దీనికి ఊతమిచ్చే అనేక ఘటనలు జరిగినట్లుగా పలు దేశాల శాస్త్రవేత్తలు అంటుంటారు. తాజాగా న్యూయార్క్ పోస్ట్ విడుదల చేసిన ఓ డాక్యుమెంటరీలోనూ గ్రహాంతర జీవుల గురించి ప్రస్తావించారు. గ్రహాంతర జీవులకు సంబంధించిన సమాచారం అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సీనియర్‌కు కూడా తెలుసని అందులో చెప్పారు. 1964లో న్యూమెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లోని సిబ్బంది గ్రహాంతరవాసులను ప్రత్యక్షంగా చూశారట. 1976లో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సీనియర్‌కు కూడా చెప్పారట. గ్రహాంతరవాసులను కలిసిన నివేదికను హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అధికారులు జార్జ్ బుష్‌కు అందించారు కూడా. అయితే దీనికి సంబంధించిన భౌతిక ఆధారాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. న్యూయార్క్ పోస్ట్ విడుదల చేసిన ‘ది ఏజ్ ఆఫ్ డిస్‌క్లోజర్’ అనే డాక్యుమెంటరీలో ఎరిక్ డేవిస్ అనే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఈ విషయాన్ని వివరించారు. మూడు అంతరిక్ష నౌకలు హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ సమీపానికి వచ్చాయని నివేదిక బయటపెట్టింది. వాటిలో ఒకటి కిందకు దిగగా, అందులో నుంచి ఓ గ్రహాంతర వాసి కిందకు వచ్చి వైమానిక దళం సిబ్బందితో మాట్లాడడానికి ప్రయత్నించినట్లు అధికారులు బుష్‌కు సమాచారం ఇచ్చారని ఎరిక్ డేవిస్ వివరించారు. అయితే మిగతా విషయాలేవీ బుష్ తనతో చెప్పలేదని, ఇతరులతోనూ చర్చించలేదని చెప్పుకొచ్చారు. గ్రహాంతర వాసులకు సమీపంగా వెళ్లిన సిబ్బందికి కాలిన గాయాలు, అంతర్గత మచ్చలు ఏర్పడినట్లు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రోగనిరోధక శాస్త్రవేత్త, క్యాన్సర్ పరిశోధకుడు గ్యారీ నోలన్ నివేదికలో తెలిపారు. అయితే తాజాగా విడుదైన ఈ నివేదికతో గ్రహాంతర జీవులపై మరోసారి చర్చ మొదలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింహాల డెన్‌లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
ఆధార్‌పై కీలక అప్‌డేట్.. దాని కోసం QR కోడ్ తప్పని సరి
Vande Bharat: డిసెంబర్లో కూత పెట్టనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు
సింహాల డెన్‌లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!
చైనా అమ్మాయి వెడ్స్ ఝార్ఖండ్ అబ్బాయి..
విచిత్ర వివాహం.. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన యువతి
సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది

