తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనడం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం చిరంజీవికి ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసి గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానించింది. చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న గౌరవానికి ఇదో తార్కాణం.