మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహోర్, నీముచ్, మందసౌర్ జిల్లాల ఉల్లి రైతులు ధరల పతనంతో తీవ్రంగా నష్టపోతున్నారు. కిలో ఉల్లికి 30 పైసల నుండి రూపాయి మాత్రమే వస్తుండటంతో, సాగు ఖర్చులు కూడా రాక తమ పంటను ఉచితంగా పంచిపెడుతున్నారు. మరికొందరు పశువులకు మేపుతున్నారు.