AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఇవి ఉంటే వెంటనే అకౌంట్‌లో డబ్బులు..

పర్సనల్ లోన్ పొందడం ఇప్పుడు సులభం. స్వయం ఉపాధి, ఫ్రీలాన్సర్లు సైతం ప్రత్యామ్నాయ డాక్యుమెంట్స్, మంచి క్రెడిట్ స్కోరుతో లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్ స్టేట్‌మెంట్, ఐటీఆర్, జీఎస్టీ వంటివి ఆదాయ రుజువుగా పనిచేస్తాయి. ప్రైవేట్ బ్యాంకులు, NBFCలు, డిజిటల్ యాప్‌లు రుణాలిస్తాయి. అయితే ముఖ్యమైన కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం..

Personal Loan: శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఇవి ఉంటే వెంటనే అకౌంట్‌లో డబ్బులు..
Personal Loan Without A Salary Slip
Krishna S
|

Updated on: Dec 10, 2025 | 3:04 PM

Share

నెలవారీ జీతం లేదా ఉద్యోగం లేని వారికి బ్యాంకులు లోన్స్ ఇవ్వవనేది ఒకప్పటి మాట. ప్రస్తుత కాలంలో శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందడం సులభమైంది. ముఖ్యంగా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఫ్రీలాన్సర్లు, సొంత వ్యాపారం చేసేవారు కూడా తమ ఆర్థిక క్రమశిక్షణను నిరూపించుకోగలిగితే సులభంగా రుణం తీసుకోవచ్చు. దీనికి కేవలం మంచి క్రెడిట్ స్కోరుతో పాటు రుణాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యం ఉందని నిరూపించే ప్రత్యామ్నాయ డాక్యుమెంట్స్ అవసరం.

ప్లే స్లిప్‌కు బదులు ఈ డాక్యుమెంట్స్..

సాధారణంగా బ్యాంకులు రుణం ఇవ్వడానికి ఆదాయ రుజువు అడుగుతాయి. పే స్లిప్ లేనివారు దానికి బదులుగా ఈ ప్రత్యామ్నాయ డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది.

బ్యాంక్ స్టేట్‌మెంట్: గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ చాలా కీలకం. మీ ఖాతాలో డబ్బు క్రమం తప్పకుండా వస్తుండటం, సరైన లావాదేవీలు చూపగలిగితే బ్యాంకు మిమ్మల్ని విశ్వసిస్తుంది.

ఐటీ రిటర్న్‌లు: గత రెండు సంవత్సరాల ఐటీ రిటర్న్‌లు సమర్పించడం బలమైన ఆదాయ రుజువుగా పరిగణిస్తారు.

జీఎస్టీ వివరాలు: మీరు వ్యాపారం చేస్తుంటే మీ జీఎస్టీ వివరాలు లేదా ఇతర వ్యాపార డాక్యుమెంట్స్.

అద్దె ఒప్పందం: మీకు అద్దె రూపంలో ఆదాయం వస్తుంటే ఆ అద్దె ఒప్పందం వంటి ఇతర ఆదాయ మూలాల పత్రాలు.

బ్యాంకులు కోరుకునేది ఒక్కటే.. మీరు రుణాన్ని తిరిగి చెల్లించగలరా..? లేదా? అనేది.. సరైన పత్రాలతో ఆ సామర్థ్యాన్ని నిరూపించుకుంటే లోన్ ఈజీగా వస్తుంది.

సిబిల్ స్కోరు చాలా ముఖ్యం

పే స్లిప్ లేకుండా రుణం పొందాలనుకుంటే మీ క్రెడిట్ స్కోరు చాలా బాగా ఉండాలి.

750+ స్కోరు: మీ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉంటే బ్యాంకులు మిమ్మల్ని బాగా నమ్ముతాయి. లోన్స్ ఈజీగా ఇస్తాయి.

క్రమశిక్షణ: పాత రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా మీ స్కోరును మంచిగా ఉంచుకోవచ్చు.

కో అప్లికెంట్: మీ స్కోరు తక్కువగా ఉన్నట్లయితే మంచి క్రెడిట్ స్కోరు ఉన్న కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడిని కో అప్లికెంట్‌‌గా చేర్చుకోవడం వల్ల లోన్ లభించే అవకాశాలు పెరుగుతాయి.

ఎక్కడ రుణం తీసుకోవాలి?

పెద్ద బ్యాంకులు నిబంధనల విషయంలో కఠినంగా ఉంటే మీరు ఈ ప్రత్యామ్నాయాలను పరిశీలించవచ్చు.

ప్రైవేట్ బ్యాంకులు: కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఫ్రీలాన్సర్‌ల కోసం ప్రత్యేక పథకాలను అందిస్తాయి.

NBFCలు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు): ఈ సంస్థలు మీ లావాదేవీలు, నగదు ప్రవాహాన్ని పరిశీలించి లోన్స్ ఇస్తాయి.

డిజిటల్ యాప్‌లు: కొన్ని కొత్త డిజిటల్ లెండింగ్ యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ముఖ్య గమనిక: రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు, ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజును సరిగ్గా చెక్ చేయండి.

ప్రమాదాలు కూడా ఉన్నాయి

పే స్లిప్ లేని రుణాలలో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి, వాటిని తెలుసుకోవడం తప్పనిసరి:

అధిక వడ్డీ రేటు: సాధారణంగా ఇలాంటి రుణాలకు వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది.

పెనాల్టీలు: మీరు వాయిదా చెల్లించడం ఆలస్యం చేస్తే విధించే లేట్ ఫీజులు, జరిమానాలు అధికంగా ఉంటాయి.

లోన్ అగ్రిమెంట్‌పై సంతకం చేసే ముందు అన్ని షరతులను చదవండి. ఏమైన సందేహం ఉంటే ఆర్థిక సలహాదారుడితో మాట్లాడటం ఉత్తమం. తొందరపడి నిర్ణయం తీసుకుని తర్వాత చింతించవద్దు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఇవి ఉంటే వెంటనే అకౌంట్‌లో..
శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఇవి ఉంటే వెంటనే అకౌంట్‌లో..
రాత్రి 8 తర్వాత ఈ గుడిలోకి వెళ్లాలంటే పూజారులకే హడల్!
రాత్రి 8 తర్వాత ఈ గుడిలోకి వెళ్లాలంటే పూజారులకే హడల్!
క్రేజీ ప్లాంట్ లేడీ అంటూ రాశిఖన్నా బ్యూటిఫుల్ ఫొటోస్
క్రేజీ ప్లాంట్ లేడీ అంటూ రాశిఖన్నా బ్యూటిఫుల్ ఫొటోస్
రోహిత్ శర్మ ప్లేస్‌కు ముప్పు తెచ్చిన విరాట్ కోహ్లీ..
రోహిత్ శర్మ ప్లేస్‌కు ముప్పు తెచ్చిన విరాట్ కోహ్లీ..
రైళ్లల్లో ఉచిత వాటర్ బాటిల్ బంద్.. రైల్వేశాఖ క్లారిటీ
రైళ్లల్లో ఉచిత వాటర్ బాటిల్ బంద్.. రైల్వేశాఖ క్లారిటీ
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
ఉద్యోగులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ATM నుంచి పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా
ఉద్యోగులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ATM నుంచి పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా
దీపం వెలిగించినా శాంతి లేదా? వెంటనే ఈ మార్పు చేయండి
దీపం వెలిగించినా శాంతి లేదా? వెంటనే ఈ మార్పు చేయండి
భూమ్మీదకు ఏలియన్స్‌ చూసిన వాళ్లకు కాలిన గాయాలు, మచ్చలు
భూమ్మీదకు ఏలియన్స్‌ చూసిన వాళ్లకు కాలిన గాయాలు, మచ్చలు