తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ కొరియోగ్రాఫర జానీ మాస్టర్ సతీమణి సుమలత అధ్యక్షురాలిగా విజయం సాధించారు. తన ప్రత్యర్థి జోసఫ్ ప్రకాష్‌పై ఆమె 29 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 510 ఓట్లు పోల్‌కాగా.. సుమలతకు 228 ఓట్లు, జోసఫ్ ప్రకాష్‌కు 199 ఓట్లు దక్కాయి.