నటి ప్రగతి తన ఫిట్నెస్ అభిరుచిని పవర్లిఫ్టింగ్గా మలుచుకొని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో ఆమె నాలుగు పతకాలు సాధించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఇప్పటికే పలు విజయాలు సాధించిన ప్రగతి, అనేకమందికి స్ఫూర్తిగా నిలిచారు.