హైదరాబాద్‌కు త్వరలో బీచ్ రాబోతోంది. కొత్తవాల్గూడలో 35 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ బీచ్, వేవ్ పూల్స్, వాటర్ యాక్టివిటీస్‌తో పాటు దుబాయ్ తరహా అక్వేరియం, అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం వంటి భారీ ప్రాజెక్టులు రానున్నాయి. వికారాబాద్‌లో కారవాన్ పార్కు, చారిత్రక కోటల వద్ద రెంటల్ కాస్ట్యూమ్స్ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇది నగరాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుస్తుంది.