అసలే చలికాలం.. దగ్గు దగ్గ లేకపోతున్నారా?
చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది సీజనల్ వ్యాధులతో సతమతం అయిపోతుంటారు. చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. కొంత మంది దగ్గు దగ్గలేక గొంతు నొప్పితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే లాంటి వారికి కోసమే ఈ అద్భుతమైన కషాయం. బాబా రామ్ దేవ్ చెప్పిన ఈ కషాయం ట్రై చేయడం వలన క్షణంలో మీ దగ్గు జలుబు, అన్నీ మాయం అవుతాయంట.
Updated on: Dec 10, 2025 | 3:55 PM

చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో అనేక రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ బారినపడి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్యలతో చాలా మంది సతమతం అవుతుంటారు.

అయితే ఇలా శీతాకాలంలో జలుబు, దగ్గు సమస్య నుంచి బయటపడటానికి ఆయుర్వేద నిపుణుడు బాబా రామ్ దేవ్ ఒక అద్భుతమైన రెమిడీ తెలియజేయడం జరిగింది. అది చాలా సులభంగా ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. కనీసం దీనిని మూడు రోజులు తీసుకున్నా దగ్గు సమస్యలు, జలుబు సమస్య త్వరగా తగ్గిపోతుంది.

ప్రతి ఒక్కరి ఇంటిలో తులసి, అల్లం, నల్ల మిరియాలు, లవంగాలు, తేనె ఉంటాయి. అయితే వీటితో అద్భుతమైన కషాయం తయారు చేసుకొని తాగడం వలన ఇది శరీరంలో వేడిని పెంచి, కఫాన్ని, సైనస్‌లను తగ్గిస్తుందంట.

ముఖ్యంగా దగ్గు, గొంతు నొప్పి దివ్యఔషధంగా పని చేస్తుందంట. కాగా, ఇప్పుడు మనం ఈ కషాయం ఎలా తయారు చేయాలో చూసేద్దాం.కావాల్సిన పదార్థాలు, తులసి, అల్లం, నల్లమిరియాలు, లవంగాలు, తేనె.

ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని నీళ్లు తీసుకొని, చిన్న అల్లం ముక్క, తులసి ఆకులు, నల్ల మిరియాలు ఆరు, లవంగాలు మూడు వేసి ఆ నీటిని 10 నిమిషాలు మరగబెట్టాలి. తర్వాత ఆ నీటిని వడబోసుకొని, గోరు వెచ్చగా ఉన్నప్పుడు కాస్త తేనె జోడించి తాగాలి. అంతే, ఈ కషాయం రోజూ ఉదయం, సాయంత్రం మూడు రోజులు తాగడం వలన జలుబు, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది.



