- Telugu News Photo Gallery Technology photos Itel launches budget smart phone in india Itel A05s price and features
Itel A05s: రూ. ఆరు వేలలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ కూడా అదుర్స్..
స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో ఫోన్ల ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఎక్కువ ఫోన్‌లు విడుదలవుతన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐటెల్ అత్యంత తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐటెల్ ఏ05ఎస్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు..
Updated on: Oct 19, 2023 | 10:59 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ ఐటెల్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐటెల్ ఏ05ఎస్ పేరుతో బడ్జెట్ ధరకే స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇంకా సేల్ ప్రారంభంచలేదు. తొలి సేల్ ఎప్పుడన్నదానిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే రూ. 6,499కే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే ప్రత్యేకంగా డిస్కౌంట్ కూడా లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్రిస్టల్ బ్లూ, గ్లోరియస్ ఆరెంజ్, మేడో గ్రీన్, నెబ్యులా బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్ ఎల్‌సీడీ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 1,612 x 720 పిక్సెల్ ఈ స్క్రీన్ సొంతం.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఈ ఫోన్ స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఆక్టాకోర్ యూనిసెస్ ఎస్‌సీ 9863 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 4000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.




