- Telugu News Photo Gallery Technology photos 32 Inch Best Selling and Top Brand Smart TVs in Amazon sale 2023
Smart TV: తక్కువ ధరలో బ్రాండెడ్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీలు.. అదిరే ఈ సేల్‌పై ఓ లుక్కేయండి..
ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. దీంతో దసరా, దీపావళికి ఇంట్లో కొత్త ప్రొడక్ట్ కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఈ కామర్స్ సైట్స్ సేల్స్ నిర్వహిస్తు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023లో భాగంగా స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇలాంటి కొన్ని స్మార్ట్ టీవీలపై ఓ లుక్కేయండి..
Narender Vaitla | Edited By: Ravi Kiran
Updated on: Oct 20, 2023 | 6:55 AM

Acer 80 cm (32 inches): ప్రముఖ పీసీ తయారీ సంస్థ అసర్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 20,999 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 11,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీలో ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌వీడియో, జీ5తో పాటు మరికొన్ని యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

LG 80 cm (32 inches): తక్కువ ధరలో ఎల్జీ వంటి బ్రాండెడ్ టీవీని సొంతం చేసుకునే అవకాశాన్ని అమెజాన్ అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 21,990కాగా ఏకంగా 45 శాతం డిస్కౌంట్లో భాగంగా కేవలం రూ. 11,990కే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే అదనం డిస్కౌంట్ సైతం లభిస్తోంది. ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 720పీ రిజల్యూషన్‌తో కూడిన 32 ఇంచెస్ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 10 వాట్స్ అవుట్‌పుట్‌తో కూడిన రెండు స్పీకర్లను అందించారు.

MI 80 cm (32 inches): తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ టీవీ ఎమ్‌ఐ. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 24,990కాగా 56 శాతం డిస్కౌంట్‌తో రూ. 10,990కే సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 1099 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ స్మార్ట్ టీవీలో 1.5 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్‌ను అందించారు. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, జీ5తో పాటు మరికొన్ని యాప్స్‌కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది.

Redmi 80 cm (32 inches): చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం రెడ్‌మీకి చెందిన ఈ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీపై ఏకంగా 60 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 24,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 9,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు మరికొన్ని యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

Samsung 80 cm: అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ టీవీ సామ్‌సంగ్. 32 ఇంచెస్ సామ్‌సంగ్ టీవీని రూ. 12,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 22,900 కాగా ఆఫర్‌లో భాగంగా 43 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 20 వాట్స్ అవుట్‌పుట్, డాల్బీ డిజిటల్ ప్లస్ ఈ టీవీ సొంతం. 2 హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌లు అందించారు.





























