- Telugu News Photo Gallery Technology photos Tech Tips How To Make Your Mobile Battery Last Longer Here Is The Tricks
Tech Tips: మొబైల్ బ్యాటరీ పాడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ మొబైల్‌తో అందించిన ఛార్జర్ నుండి ఫోన్‌ను ఛార్జ్ చేయండి. ప్రస్తుతం అన్ని మొబైల్స్ USB కేబుల్ ద్వారా ఛార్జ్ చేయబడతాయి. కంప్యూటర్‌లో పెట్టుకున్నా లేదా ఇతర కంపెనీల ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేసినా సమస్య వస్తుంది. అందుకే కంపెనీ అందించిన ఛార్జర్ నుండి ఛార్జ్ చేయండి. అప్పుడు బ్యాటరీ కూడా ఎక్కువసేపు ఉంటుంది. మొబైల్ వేడెక్కడం వల్ల బ్యాటరీపై కూడా ప్రతికూల..
Updated on: Oct 20, 2023 | 11:10 AM

ప్రస్తుతం 5000mAh నుండి 7000mAh వరకు బ్యాటరీలు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎక్కువ ఛార్జ్‌తో వస్తాయి. అయితే ఈ బ్యాటరీని సరిగా మెయింటెయిన్ చేయకుంటే కొన్ని నెలల్లోనే పాడయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు విడుదలైన చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జర్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. మరి కొన్ని నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయిపోతుందన్నది నిజం. అయితే, బ్యాటరీ బాగోగులు చూడకుంటే వేగంగా చెడిపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఏం చేయాలి?.

మీ మొబైల్‌తో అందించిన ఛార్జర్ నుండి ఫోన్‌ను ఛార్జ్ చేయండి. ప్రస్తుతం అన్ని మొబైల్స్ USB కేబుల్ ద్వారా ఛార్జ్ చేయబడతాయి. కంప్యూటర్‌లో పెట్టుకున్నా లేదా ఇతర కంపెనీల ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేసినా సమస్య వస్తుంది. అందుకే కంపెనీ అందించిన ఛార్జర్ నుండి ఛార్జ్ చేయండి. అప్పుడు బ్యాటరీ కూడా ఎక్కువసేపు ఉంటుంది.

మొబైల్ వేడెక్కడం వల్ల బ్యాటరీపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ర్యామ్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గేమ్స్ ఆడితే మొబైల్ వేడెక్కుతుంది. వెంటనే గేమ్ ఆడటం మానేయండి. మొబైల్ చల్లబడే వరకు ఉపయోగించవద్దు. వీలైనంత వరకు కారు లేదా బైక్ ఛార్జర్ల ద్వారా ఫోన్ బ్యాటరీని రీఛార్జ్ చేసే అలవాటును మానుకోండి. ఎందుకంటే, దాని నుండి అధిక కరెంట్ ఫోన్ బ్యాటరీపై ప్రభావం చూపుతుంది.

కొంతమంది తమ మొబైల్‌లను రాత్రిపూట ఛార్జ్ చేసి ఉంచుతారు. ఇలా చేయడం ప్రమాదకరం. దీని వల్ల బ్యాటరీ ఎక్కువ సేపు ఉండదు. ఓవర్‌ఛార్జ్ కూడా చేయవద్దు. 90% ఛార్జ్ అయిన వెంటనే ఛార్జర్‌ను ఆఫ్ చేయండి. వైఫై, బ్లూటూత్ ద్వారా ఛార్జ్ చేసే వైర్‌లెస్ ఛార్జర్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటికి వీలైనంత దూరంగా ఉంటే మొబైల్ బ్యాటరీ ఆరోగ్యం బాగుంటుంది.

బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడం పొరపాటు అయినా.. మరీ తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు వాడుతున్నా మొబైల్ పెరిగే ఒత్తిడి బ్యాటరీపై పడుతుంది. అందుకే మొబైల్ ఛార్జ్ 20 శాతం చేరిన వెంటనే 80 శాతం ఛార్జింగ్ వచ్చే వరకు ఛార్జ్ చేయండి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది.





























