- Telugu News Photo Gallery Technology photos Flipkart sale 2023 Best printers under 5k, Check here for full details
Printers: ప్రింటర్స్ మరీ ఇంత తక్కువ ధరకే.. ఈ డీల్స్ చూస్తే వెంటనే కొనేస్తారు.
ఆఫీస్ వర్క్, స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ కారణం ఏదైనా ప్రింటర్స్ వినియోగం అనివార్యంగా మారింది. దీంతో ప్రతీ చిన్న అవసరానికి జిరాక్స్ సెంటర్స్, నెట్ సెంటర్స్‌కి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతీసారి బయటకు వెళ్లకుండా మనమే ఓ ప్రింటర్‌ను కొనుగోలు చేసుకుంటే పోతుంది కదా అనే ఆలోచన వస్తుంది. అయితే ధర ఎక్కువ ఉంటుందని వెనుకడుగు వేస్తుంటారు. కానీ ప్రస్తుతం సేల్‌లో చాలా తక్కువ ధరకే ప్రింటర్స్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది అమెజాన్. మరి ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Oct 26, 2023 | 7:29 PM

Canon MG2570S: ప్రింటర్స్‌కి పెట్టింది పేరైన కెనాన్ కంపెనీకి చెందిన ఈ మల్టీ ఫంక్షన్ కలర్ ఇంజెక్ట్ ప్రింటర్ అసలు ధర రూ. 3,650కాగా సేల్‌లో భాగంగా రూ. 3,199కే సొంతం చేసుకోవచ్చు. యూఎస్‌బీ కనెక్టివిటీ ఫీచర్‌తో పనిచేసే ఈ ప్రింటర్‌తో కలర్ ప్రింట్స్ కూడా తీసుకోవచ్చు.

Canon PIXMA TS207 : కెనాన్ కంపెనీకి చెందిన పిక్స్‌మా టీఎస్207 సింగిల్ ఫంక్షన్ కలర్ ఇంజెక్ట్ ప్రింటర్ అసలు ధర రూ. 2,695 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2,299కి సొంతం చేసుకోవచ్చు. యూఎస్‌బీ కనెక్టివిటీతో పనిచేసే ఈ ప్రింటర్, కలర్ ప్రింట్ పొందొచ్చు. ఏ4 సైజ్ ప్రింట్ స్పీడ్ 4ఐపీఎమ్‌గా ఉంది.

HP DeskJet 1212: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ప్రింటర్స్‌లో హెచ్‌పీ డెస్క్‌జెట్ 1212 ఒకటి. ఈ ప్రింటర్ అసలు ధర రూ. 3,112 కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2699కి సొంతం చేసుకోవచ్చు. యూఎస్‌బీతో ఈ ప్రింటర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. కలర్ ప్రింట్ స్పీడ్ (ఏ4 సైజ్) 5.5 ఐపీఎమ్‌గా ఉంది.

HP DeskJet 2331: హెచ్‌పీ కంపెనీకి చెందిన ఈ మల్టీ ఫంక్షన్ కలర్ ఇంజెక్ట్ ప్రింటర్‌లో స్కానర్‌ను సైతం అందించారు. ఈ ప్రింటర్ అసలు ధర రూ. 4,971 కాగా 25 శాతం డిస్కౌంట్‌తో రూ. 3,699కి సొంతం చేసుకోవచ్చు. హెచ్‌పీ స్మార్ట్ యాప్‌తో పాటు యూఎస్‌బీతో కనెక్ట్ చేసుకోవచ్చు. కలర్ ప్రింట్ పొందొచ్చు. రూ.1233 ఈఎమ్‌ఐతో ఈ ప్రింటర్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

HP DeskJet 2723: హెచ్‌పీ కంపెనీకి చెందిన ఈ కలర్ ప్రింటర్ గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి వాయిస్ కమాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది. కాపీ, స్కాన్, బ్లూటూత్, యూఎస్‌బీలకు సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రింటర్ అసలు ధర రూ. 7005కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 5000కి సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రింటర్‌ను రూ. 834 ఈఎమ్‌ఐ చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవచ్చు.





























