- Telugu News Photo Gallery Technology photos Amazon, Flipkart sale 2023 Huge discount on realme smart phones, Check here for full details
Realme: రియల్‌మీ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్.. ఈ స్పెషల్ డీల్స్‌పై ఓ లుక్కేయండి..
ప్రస్తుతం పండుగ సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ భారీ ఎత్తున ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్ సైతం డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు, స్మార్ట్ ఫోన్‌ల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా ప్రత్యేకంగా రియల్‌మీ స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఇంతకీ ఈ సేల్‌లో రియల్‌మీకి చెందిన ఏయే ఫోన్‌లపై ఎంత డిస్కౌంట్స్ లభిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..
Updated on: Oct 21, 2023 | 8:00 AM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ అమెజాన్ సేల్‌లో భాగంగా భారీ సేల్‌ను అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా రియల్‌మీ కంపెనీకి చెందిన ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో కూడా ఈ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు.

రియల్‌మీ 11 5జీ: రియల్‌మీ 11 5జీ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999కాగా సేల్‌లో భాగంగా రూ. 15,999కి సొంతం చేసుకోవచ్చు

రియల్‌మీ 11 ప్రో+ 5జీ: అమెజాన్ సేల్‌లో రియల్‌మీ 11 ప్రో +పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 27,999కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 24,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక 12 జీబీ ర్యామ్ విషయానికొస్తే రూ. 29,999 అసలు ధర కాగా డిస్కౌంట్‌లో రూ. 28,999కి సొంతం చేసుకోవచ్చు.

ఇక రియల్ మీ సీ53 స్మార్ట్ ఫోన్‌పై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 9,999కాగా, సేల్‌లో రూ. 9,499కి సొంతం చేసుకోవచ్చు. ఇక 6జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్‌ని రూ. 10,999గా ఉంది.

రియల్ మీ నార్జో 60 ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 14,499కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 11,499కే సొంతం చేసుకోవచ్చు. ఇక 4జీబీ ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ. 12,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 10,999కి సొంతం చేసుకోవచ్చు.

రియల్ మీ 11 ప్రో 5G: రియల్‌మీ 11 ప్రో స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999కాగా, డిస్కౌంట్‌లో భాగంగా కేవలం రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సొంతం చేసుకోవచ్చు.




