తెలంగాణ ప్రజలకు అలర్ట్.. వచ్చే మూడు రోజులు..
తెలంగాణలో చలి తీవ్రత పెరిగి, అనేక జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. రాబోయే మూడు రోజులు చలిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలున్నవారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది.
చలి తీవ్రత తెలంగాణ ప్రజలను గజగజా వణికిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయి ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ.. వచ్చే మూడు రోజుల వాతావరణంపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల వరకు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటనలో తెలిపింది. దాదాపు 20 జిల్లాల్లో 10 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, డిసెంబరు 10 నుంచి 13 తేదీల మధ్య మరింత తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. వీటి ప్రభావంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5°C నుండి 7°C వరకు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌తో సహా మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4° వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. పొడి గాలి, బలమైన ఈశాన్య గాలులు రాత్రిపూట చల్లదనాన్ని పెంచడమే దీనికి కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, రాబోయే మూడు రోజులు తెలంగాణ అంతటా వాతావరణం పొడిగా ఉంటుందని వెల్లడించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రిపూట, తెల్లవారుజామున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చలి సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత 6.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా లో 6.3, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో 6.4, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 6.9 డిగ్రీలుగా నమోదైనట్టు పేర్కొన్నది. నగరంలో 16వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 9 నుంచి 12 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నదని వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాసులు కురిపిస్తున్న హారర్ సినిమాలు..
మల్టీప్లెక్స్ బిజినెస్.. మూడు పువ్వులు ఆరు కాయలు
Akhanda 2: అఖండ 2 ఈ వారమా..3 రోజుల్లో సాధ్యమేనా
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్లాన్ B.. ఉస్తాద్ తర్వాత రీ ఎంట్రీ
Gold Price Today: అయ్యో.. పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది.. ఇవాళ తులం ఎంతంటే
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
సింహాల డెన్లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!

