AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pavala Syamala: అయ్యో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన నటి పావలా శ్యామల.. చివరకు..

వందలాది సినిమాల్లో నటించిన పావలా శ్యామల ఇప్పుడు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తన నటనతో ఆడియెన్స్ ను అలరించిన ఆమె ఇప్పుడు వృద్ధాప్య సమస్యలతో పాటు తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఆమె ఆత్యహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు చూసి..

Pavala Syamala: అయ్యో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన నటి పావలా శ్యామల.. చివరకు..
Actress Pavala Syamala
Basha Shek
|

Updated on: Dec 10, 2025 | 6:03 PM

Share

సుమారు 300 కుపైగా తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు పావలా శ్యామల. తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించారు. అయితే ఈ సీనియర్ నటి ఇప్పుడు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వృద్ధాప్య సమస్యలు, తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో శ్యామల జీవితం అస్యవ్యస్తంగా మారింది. నటితో పాటు ఆమె కూతురు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం అందరినీ కలచివేస్తోంది. గతంలో చాలా మంది సినీ ప్రముఖులు శ్యామలకు ఆర్థిక సాయం అందజేశారు. కానీ ఆ డబ్బులు వారి మందులు, ఇతర అవసరాలకే సరిపోయాయి. ఈ క్రమంలో కొందరు వారిని ఓ హోమ్‌లో చేర్పించగా, అక్కడ వారి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇద్దరూ మంచానికే పరిమితమయ్యారు. దీంతో ఇక శ్యామలకు సేవలు అందించలేమంటూ ఆ హోమ్ నిర్వాహకులు తల్లీకూతుళ్లను బయటకు పంపించేశారు.

దిక్కుతోచని స్థితిలో రోడ్డుపైకి చేరిన శ్యామల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారిని కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది వారిని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని తిరుమలగిరి ఏసీపీ రమేశ్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఏసీపీ, వారిని కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ హెల్త్‌కేర్ సెంటర్‌కు తరలించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామకృష్ణ వారికి ఆశ్రయం కల్పించి, అవసరమైన అన్ని సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు. తమ ఫౌండేషన్ ద్వారా అనాథ వృద్ధులకు సాయం అందిస్తున్నామని, ఏదైనా సాయం కావాలంటే తమను సంప్రదించాలని (9866491506) ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి

కొన్ని రోజుల క్రితం ఆస్పత్రి బెడ్ పై దీన స్థితిలో పావలా శ్యామల..

కాగా గతంలో శ్యామల దీన పరిస్థితి తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి ఆమెకు లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సాయం చేశారు. అలానే యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, ఆకాశ్ పూరి, నటుడు కాదంబరి కిరణ్ తో సహా మరికొందరు నటికి ఆర్థిక సాయం చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.