8 సినిమాలు చేస్తే రెండే హిట్లు.. టార్గెట్ చేశారంటూ హీరోయిన్ ఎమోషనల్..
Rajitha Chanti
Pic credit - Instagram
తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో ఆమె పేరు మారుమోగింది.
తెలుగులో మొత్తం 8 సినిమాల్లో నటిస్తే రెండు మాత్రమే హిట్టయ్యాయి. అలాగే 6 సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. తనను టార్గెట్ చేశారని ఎమోషనల్ అయ్యింది.
ఆమె మరెవరో కాదు హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో బేబమ్మగా అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. ఫస్ట్ మూవీతోనే ఊహించని స్టార్ డమ్ అందుకుంది.
ఆ తర్వాత ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. కానీ ఆ చిత్రాల్లో కేవలం రెండు మాత్రమే సూపర్ హిట్టయ్యాయి. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు హిట్టయ్యాయి.
అవకాశాలు తగ్గిపోవడంతో తమిళంకు షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు అక్కడే సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్లలో ఎమోషనల్ అయ్యింది.
తనపై నిందలు వేస్తూ టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. సినిమా ఫెయిల్ అయితే తననే నిందిస్తున్నారని.. విమర్శిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది.
ఎలాంటి కారణం లేకుండా ద్వేషాన్ని పొందాల్సి రావడం భరించలేని విషయమని అన్నారు కృతి శెట్టి. కెరీర్ తొలినాళ్లల్లో ఎంతో ఒత్తిడికి గురయ్యానని తెలిపింది కృతి శెట్టి.
ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళంలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది కృతిశెట్టి.