బిగ్ బాస్ తెలుగు 9లో వీల్ బారో టాస్క్ అనంతరం కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఒక మెలిక పెట్టారు. తదుపరి టాస్క్ నుంచి ఒకరిని తప్పించాలని ఆదేశించగా, తనుజ కన్నింగ్ ఆలోచనతో ఇమ్మానుయేల్ ను టార్గెట్ చేసింది. సంజన ద్వారా ఇమ్మానుయేల్ ను నామినేట్ చేయించబోయింది. ఈ విషయం తెలిసి ఇమ్మానుయేల్, సంజనల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.