చేసిందే ఒక్క సినిమా.. విడుదలకు ముందే డైరెక్టర్‌కు ఇచ్చిపడేసింది..
Rajitha Chanti
Pic credit - Instagram
తమిళ చిత్రపరిశ్రమలో ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. ఆమె చేసిన ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
ఆమె పేరు దివ్య భారతి. బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాలతో అలరించి గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది దివ్యభారతి.
అయితే ఈ సినిమా విడుదలకు ముందే డైరెక్టర్ తో తనకున్న వివాదాన్ని బయటపెట్టింది. ఈ సినిమా డైరెక్టర్ తనను షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా అవమానించడాని తెలిపింది.
ఈ మొత్తం వ్యవహారంలో హీరో సైతం సైలెంట్ గా ఉండడం చాలా బాధించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దివ్య భారతి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
అలాగే డైరెక్టర్ నరేష్ కొప్పిలి తనను చిలక అంటూ ట్వీట్ చేయడంపై గట్టిగానే రియాక్ట్ అయ్యింది. మహిళలను చిలక, మరేదైనా పదంతో పిలవడం జోక్ కాదని తెలిపింది.
ఆడవాళ్లకే తనకెంతో ద్వేషముందని.. సెట్ లోనూ అతడు ఇలాగే ప్రవర్తించేవాడని తెలిపిందే. పదే పదే మహిళలను కించపరుస్తూ తన కళకే ద్రోహం చేశాడని సీరియస్ అయ్యింది.
డైరెక్టర్ అలా ప్రవర్తించడమే కాకుండా హీరో మౌనంగా ఉండడం కూడా తనను బాధించిందని తెలిపింది. ప్రస్తుతం దివ్య భారతి తెలుగులో గోట్ చిత్రంలో మాత్రమే నటిస్తుంది.