Watch: వామ్మో జర్రుంటే మటాషే.. పొద్దు పొద్దున్నే గ్రామస్తులపై విరుచుపడిన చిరుత.. చివరకు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బుధవారం ఉదయం చిరుతపులి సంచారం కలకలం రేపింది. పొద్దు పొద్దున్నే గ్రామంలోకి చొరబడిన చిరుత జనాలపై దాడి చేసింది. ఈ చిరుత దాడిలో సుమారు ఏడుగురు గ్రామస్తుల వరకు గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బుధవారం ఉదయం చిరుతపులి సంచారం కలకలం రేపింది. అడవిలోంచి దారి తప్పిన చిరుత బుధవారం ఉదయం పార్డి ప్రాంతంలోని శివ్ నగర్ గ్రామంలోకి వచ్చింది. గ్రామంలో చిరుతను చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దాన్ని అక్కడి నుంచి తరిమేసేందుకు ప్రయత్నించారు. దీంతో జనాలను శత్రువులుగా భావించిన చిరుత వారిపై దాడికి దిగింది.. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక చిరుత దాడిలో సుమారు ఏడుగురు గ్రామస్తులు గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించినా.. అది అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని వెళ్లిపోయింది. దీంతో గాయపడిన గ్రామస్తులను స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తరలించారు అధికారులు. వీరంతా ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై నాగ్‌పూర్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (DCF) వినితా వ్యాస్ మాట్లాడుతూ.. పార్డి ప్రాంతంలోని శివ్ నగర్‌లో చిరుత కదలికలు ఉన్నట్టు తమకు సమాచారం వచ్చిందని.. దీంతో ఘటనా స్థలానికి కొందు అధికారులను పంపామని తెలిపారు. అప్పటికే చిరుత సుమారు ఏడుగురు గ్రామస్తులను గాయపరిచిందని.. వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు.
అయితే ఈ ప్రాంతాల్లో చిరుత సంచారం ఇదే కొత్త కాదని.. గత రెండు నెలల్లో, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో చిరుతపులులు ప్రజలపై దాడి చేసిన సంఘటనలు వరుసగా నమోదయ్యాయని తెలుస్తోంది. నాసిక్, నాగ్‌పూర్, గోండియా, రాయ్‌గఢ్ ప్రాంతాల్లోని ప్రజలపై చిరుతపులి తరచుగా దాడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో స్థానిక ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని.. కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు.
వీడియో చూడండి..
#Nagpur | At least seven people were injured in a leopard attack in Shiv Nagar. The victims were admitted to Shri Bhavani Hospital in Paradi. Four have been discharged, one is in critical condition in the ICU, and two remain in the general ward. Visuals show the aftermath of the… pic.twitter.com/I9dCnB0peU
— Deccan Chronicle (@DeccanChronicle) December 10, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




