Personality Test: మీ నుదటి ఆకారాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?
ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలంటే.. చాలా మంది జోతిష్యుల దగ్గరకి వెళ్తారు. వారు మన చేతి రేఖలను చూసి మనం ఎలాంటి వారం అనేది చెప్తారు, కానీ ఇవే కాకుండా మన బాడీలోకి కొన్ని శరీర భాగాలు కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని మీకు తెలుసా? అవును మన శరీర భాగాల ఆకారాన్ని బట్టి మన వ్యక్తిత్వాని తెలుసుకోవచ్చు. కాబట్టి మన నుదిటి ఆకారాన్ని బట్టి మన వ్యక్తి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Updated on: Dec 09, 2025 | 7:15 AM

చేతి రేఖలు, హస్తముద్రికం ద్వారా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని చాలా మందికి తెలుసు. కానీ మన శరీర భాగాల ఆకారాన్ని బట్టి ఒకరి వ్యక్తిత్వం ఎలాంటిదో అంచనావేయవచ్చని మీకు తెలుసా? అవును మన కన్ను, చెవి, ముక్కు, పాదాల ఆకారం మొదలైనవి వాటి ద్వారా కూడా మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.

నుదట పొడువగా ఉండడం: మీ నుదుట పెద్దగా ఉంటే, మీరు ఒకేసారి అనేక పనులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని అర్థం. మీరు అనుకున్న పనిని మీ తెలివితేటలతో సాధిస్తారు. అలాగే మీరు ఎల్లప్పుడూ కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తారు. అందరితో స్వేచ్ఛగా కలిసి మెలిసి ఉంటారు. మాట్లాడుతారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు చాలా కోపంగా ఉంటారు.

నుదుట చిన్నగా ఉండడం: చిన్న నుదుట ఉన్నవారు సాధారణంగా ఏకాంతంగా ఉండాలనుకుంటారు. వారు భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాగే పక్కవాళ్ల మనుసును ఈజీగా అర్థం చేసుకుంటారు. కానీ కొన్ని సార్లు వీరు ఇతరు వల్ల ఎక్కువగా బాధపడుతారు. అంతేకాదు వీరు శత్రవులకు దూరంగా ఉండాలని ఇష్టపడుతారు.కానీ వీళ్లు ప్రేమించే వ్యక్తిని మాత్రం అంత సులభంగా వదులుకోరు.

నుదుట ఆకారం వంపుగా ఉన్నవారు: గుండ్రంగా, వంగిన నుదుటు ఆకారం ఉన్న వ్యక్తులు సరళంగా, మర్యాదగా, స్నేహపూర్వకంగా ఉంటారు. వారు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. అలాగే అందరితో సులభంగా కలిసిపోతారు. వీరు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో పట్టుదలతో ఉంటారు. వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులలైనా ప్రశాంతంగా ఎదుర్కొంటారు. అలాగే దేన్నైనా ఆలోచించి నిదానంగా చేస్తారు.

M-ఆకారపు నుదుట: M-ఆకారపు నుదుట కలిగిన వారు కళాభిమానులు. వీరు తమ పని గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు దృఢ నిశ్చయంతో ప్రతి పనిని ముందుచూపుతో చేస్తారు. వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. వారు కొన్నిసార్లు కోపంగా ఉన్నప్పటికీ, వారు చాలా త్వరగా క్షమాపణలు చెబుతారు. ముఖ్యంగా, వారు తమకు ఇష్టమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరు.




