Sleep Deprivation: 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా?.. ఈ సమస్యలు ఫేస్ చేసేందుకు సిద్దంకండి!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో, మంచి శారీరక, మానసిక ఆరోగ్యానికి 7 నుండి 9 గంటల నిద్ర కూడా అంతే అవసరం. కానీ ఈ రోజుల్లో, చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. వారు ఎంత ప్రయత్నించినా, సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. ఇలా నిద్రలేక పోవడం వల్ల అనేక అనారోగ్య మస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ప్రతిరోజూ 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఎన్ని సమస్యలు తలెత్తుతాయో మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.
Updated on: Dec 09, 2025 | 7:00 AM

మీ మెదడు పనితీరుపై ప్రభావం: మీరు ప్రతిరోజూ తగినంత నిద్రపోకపోతే, మీ మెదడు సరిగ్గా పనిచేయదు. మీరు ఏకాగ్రతను కోల్పోతారు. అలాగే నిద్ర లేకపోవడం చర్మ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, దీని వలన చర్మంపై ముడతలు, నల్లటి వలయాలు కనిపిస్తాయి. కాబట్టి, మీరు రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి.

హార్మోన్ల అసమతుల్యత: నిద్ర లేకపోవడం ప్రధానంగా హార్మోన్ల వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని ఫలితంగా ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి, ఇది ఆందోళన, చిరాకు, రక్తపోటు, ఆకలిని కూడా ప్రభావితం చేస్తుంది. రోజుకు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సమతుల్యత దెబ్బతింటుంది, కాలక్రమేణా ఇది టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి దారితీస్తుంది.

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ: నిద్ర లేకపోవడం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఫలితంగా, మీరు తరచుగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. దీని ఏవైనా గాయాలైనప్పుడు అవి త్వరగా తగ్గవు. దీని వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.

జ్ఞాపకశక్తి కోల్పోవడం: తగినంత నిద్ర రాకపోతే, దాని ప్రభావాలు మెదడుపై వెంటనే కనిపిస్తాయి. ఇది జ్ఞాపకశక్తి కోల్పోవడానికి కూడా దారితీస్తుంది. అలాగే, రాత్రికి తగినంత నిద్ర రాకపోతే, అది మీ శ్రద్ధ, నిర్ణయం తీసుకోవడంపై ప్రభావం చూపుతుంది.

దీర్ఘకాలిక వ్యాధులు: రోజుకు ఆరు గంటల కన్నా తక్కువ నిద్రపోవడం వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్, ఊబకాయం, మధుమేహం, నిరాశ, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.




