- Telugu News Photo Gallery Spiritual photos AP Tourism special package for those who want to visit Visakhapatnam and Aruku
Araku Tour: అరకు వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. చవక ధరకే టూరిజం శాఖ ఆఫర్
ఫ్రెండ్స్‌తో కలిసి అరకు వెళ్లి ఎంజాయ్ చేయాలని చాలామంది ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. అయితే బస్, రైలు సౌకర్యం ఎలా అనేది తెలియదు. ఇక ఎక్కడ బస చేయాలనేది కూాడా అవగాహన ఉండదు. అలాంటివారి కోసం ఏపీ టూరిజం మంచి అవకాశం కల్పిస్తోంది.
Updated on: Dec 08, 2025 | 8:34 PM

విశాఖ, అరకు అందాలను చూడాలనుకుంటున్నారా..? ఫ్రెండ్ లేదా ఫ్యామిలీతో కలిసి వెళ్లాలనుకుంటున్నారా..? ఎలా వెళ్లాలి..? ఎక్కడ బస చేయాలి..? ఏయే ప్రదేశాలు చూడాలి? అనే కన్‌ప్యూజన్‌లో ఉన్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్.. ఇక మీరు వసతి, బస్సు సౌకర్యం, ఇతర విషయాల గురించి ఎలాంటి టెన్షన్ పడకుండా అరకు, వైజాబ్ అందాలను చూసి రావొచ్చు. ఇందుకోసం ఏపీ టూరిజం శాఖ కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఏపీ టూరిజం పర్యాటకుల కోసం టూరిజం ప్యాకేజీని ప్రవేశపెట్టింది. మీరు ఏపీ టూరిజం వెబ్‌సైట్లోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవాలి. మీరు ఏ రోజు అయితే వెళ్లాలనుకుంటున్నారో ఆ రోజుకి టికెట్ బుక్ చేసుకుంటే బస్సు, రైళ్లల్లో అరకు, వైజాగ్‌లోని అన్ని ప్రాంతాలను చూడవచ్చు. బుక్ చేసుకున్నవారి కోసం ఉదయం 9 గంటలకు వైజాగ్‌లో బస్సు బయల్దేరి బీచ్, మ్యూజియం, శిల్పారామం, కైలాసగిరి, సింహాచలం ఆలయం, ఫిషింగ్ హార్బర్ వంటి ప్రాంతాలను చూపిస్తారు

ఇక రోజూ ఉదయం 7 గంటలకు వైజాగ్ నుంచి అరకుకు బస్సు ఉంటుంది. ఈ బస్సులో వెళితే అరకులోని కాఫీ తోటలు, గిరిజన మ్యూజియం, బొర్రా గుహలు, పద్మావతి గార్డెన్, గాలికొండ వ్యూ వంటి ప్రాంతాలు చూడవచ్చు. చూశాక రాత్రి 9 గంటలకు ఆ బస్సులోనే తిరిగి విశాఖకు వస్తారు.

ఇక ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయత్రం స్నాక్స్, టీ వంటివి ఈ ప్యాకేజీలోనే అందిస్తారు. ఇక అరకుకు రైళ్లో వెళ్లాలనుకునేవారికి ఈ ప్యాకేజీలో అవకాశం కల్పిస్తారు. పచ్చని చెట్లను చూసుకుంటూ అరకుకు రైలు ప్రయాణం చేయవచ్చు.

బస్సుల్లో విశాఖ ప్యాకేజ్ అయితే పెద్దలకు రూ.800, పిల్లలకు రూ.700గా ఉంది. ఇక అరకు ప్యాకేజ్ బస్సులో అయితే పెద్దలకు రూ.1590, పిల్లలకు రూ.1270గా ఉంది. ఇక రైలులో అరకు ప్యాకేజ్ అితే పెద్దలకు రూ.1710, పిల్లలకు రూ.1370గా ఉంది




