Rashi Phalalu: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today(December 09, 2025): మేష రాశి వారు ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. సహోద్యోగులతో వాదోపవాదాలకు దిగే అవకాశం కూడా ఉంది. వృషభ రాశికి చెందిన వారు ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మిథున రాశి వారికి ఆశించిన మేరకు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి చూపుతారు. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (డిసెంబర్ 09, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. సహోద్యోగులతో వాదోపవాదాలకు దిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో ఎదురయ్యే కొన్ని ఒడిదుడుకులను ప్రశాంతంగా పరిష్కరించుకోవడం మంచిది. కొత్త ప్రయత్నాలకు, కొత్త కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి. విలాస జీవితం అనుభవిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): కుటుంబంలోనే కాక, వ్యక్తిగతంగా కూడా సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. కొన్ని సానుకూలతల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ సమర్థతకు, నైపుణ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లోనే కాక, ఆర్థిక లావాదేవీల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆశించిన మేరకు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి చూపించడం, ఇతరులకు సహాయం చేయడం వంటివి ఈ రోజు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు, సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ఉద్యోగుల మీద అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఆదాయంతో కుటుంబ ఖర్చులు పోటీపడతాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రోజు అటు ఉద్యోగంలోనూ ఇటు వృత్తి, వ్యాపారాల్లోనూ కొద్దిగా రిస్కు తీసుకోవలసిన పరిస్థితులుంటాయి. ఉద్యోగంలో సీనియర్లు, సహోద్యోగుల నుంచి సవాళ్లు ఎదురవుతాయి. జాగ్రత్తగా వాటిని ఎదుర్కోవడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడం మీద ఎక్కువ సమయం ఖర్చవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు కానీ, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కొన్ని కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. బంధువులతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా పని భారం పెరిగినా ప్రతిఫలం ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాల్ని మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపా రాల్లో శ్రమ ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం పొందుతారు. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపోతుంది. సహోద్యోగులతో బాధ్యతలు పంచుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమాధిక్యత ఉన్నా ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. బంధుమిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): కొందరు బంధుమిత్రులు మీ సహాయం కోసం ఎదురు చూస్తారు. కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, లక్ష్యాలు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో తీవ్ర ఒత్తిడికి అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది. పెండింగు పనులు పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్ప కపోవచ్చు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు సన్నిహితులు మిమ్మల్ని సొంత పనులకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆస్తి వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో కొన్ని ఊహించని సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలవరకు బయటపడతారు. నిరుద్యోగులకు కొన్ని సదవకాశాలు లభిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థాన చలన సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో రాబడికి లోటుండకపోవచ్చు. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. తోబుట్టువులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి.



