ఒకే వేదికపైకి అమిత్ షా , మోహన్ భగవత్.. ఎక్కడ కలుసుకోబోతున్నారంటే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయం సంచాలక్ మోహన్ భగవత్ ఒకే వేదికపై కలుసుకోబోతున్నారు. శుక్రవారం(డిసెంబర్ 12) ఇద్దరు నేతలు అండమాన్ - నికోబార్ దీవులను సందర్శించనున్నారు. అండమాన్‌లోని విజయపురంలో వీడీ సావర్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. డిసెంబర్ 13 సాయంత్రం విజయపురంలోని ఐటీఎఫ్ మైదానంలో జరిగే బహిరంగ ర్యాలీలో మోహన్ భగవత్ ప్రసంగించే అవకాశం ఉంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయం సంచాలక్ మోహన్ భగవత్ ఒకే వేదికపై కలుసుకోబోతున్నారు. శుక్రవారం(డిసెంబర్ 12) ఇద్దరు నేతలు అండమాన్ – నికోబార్ దీవులను సందర్శించనున్నారు. అండమాన్‌లోని విజయపురంలో వీడీ సావర్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇద్దరు నేతలు సావర్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సావర్కర్ పై రూపొందించిన ఒక పాటను ఇదరు కలిసి విడుదల చేస్తారు.
డిసెంబర్ 12 రాత్రి లేదా డిసెంబర్ 13 ఉదయం అమిత్ షా దీవులకు వస్తారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, డిసెంబర్ 13 సాయంత్రం విజయపురంలోని ఐటీఎఫ్ మైదానంలో జరిగే బహిరంగ ర్యాలీలో మోహన్ భగవత్ ప్రసంగించే అవకాశం ఉంది.
అమిత్ షా — మోహన్ భగవత్ పర్యటన నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సర్ సంఘ్‌చాలక్‌గా మోహన్ భగవత్ ఈ ద్వీపసమూహానికి ఇది మొదటి పర్యటన అవుతుంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం సర్కార్యవాహుడిగా భగవత్ అండమాన్ – నికోబార్ దీవులను సందర్శించారు. కాగా, ఇది అమిత్ షా రెండవ పర్యటన అవుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని పురస్కరించుకుని జనవరి 2023లో అమిత్ షా సందర్శించారు.
నిజానికి, వీర్ సావర్కర్ ప్రసిద్ధ కవిత “సాగ్ర ప్రాణ తల్మాల” (ఓ మహాసముద్రమా, నా ఆత్మ ఆరాటపడుతోంది, నన్ను మాతృభూమికి తీసుకెళ్లు) రచన 116వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహారాష్ట్రలోని ఒక ప్రముఖ వ్యాపార బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సావర్కర్ ఈ కవితను 1909లో రాశారు. బ్రిటిష్ వారు ఆయనను 1911లో పోర్ట్ బ్లెయిర్ (ప్రస్తుతం శ్రీ విజయపురం అని పిలుస్తారు)లోని సెల్యులార్ జైలులో బంధించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




